ఇండియాలో నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1 స్టార్టప్‌‌‌‌‌‌‌‌ జెప్టో

ఇండియాలో నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1 స్టార్టప్‌‌‌‌‌‌‌‌ జెప్టో
  • లింక్డిన్‌‌‌‌‌‌‌‌ టాప్‌‌‌‌‌‌‌‌ స్టార్టప్స్‌‌‌‌‌‌‌‌ లిస్ట్‌‌‌‌‌‌‌‌ 

న్యూఢిల్లీ: ఇండియాలో నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వన్‌‌‌‌‌‌‌‌ స్టార్టప్‌‌‌‌‌‌‌‌గా క్విక్ కామర్స్‌‌‌‌‌‌‌‌ కంపెనీ జెప్టో నిలిచింది. లింక్డిన్ టాప్ స్టార్టప్స్‌‌‌‌‌‌‌‌ ఇండియా లిస్ట్ 2024 లో  వరుసగా రెండో ఏడాది కూడా  నెంబర్ వన్‌‌‌‌‌‌‌‌ ర్యాంక్ దక్కించుకుంది. లింక్డిన్‌‌‌‌‌‌‌‌ మెంబర్ల నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఈ లిస్ట్‌‌‌‌‌‌‌‌ను కంపెనీ రెడీ చేసింది.

 ఉద్యోగ కల్పనలో వృద్ధి, కస్టమర్లకు  ఎంత చేరువయ్యారు, ఉద్యోగాలు ఎలా ఉన్నాయి,  ట్యాలెంట్ ఉన్నవారిని ఎలా ఆకర్షిస్తున్నారనే అంశాలను పరిగణనలోకి తీసుకుంది.  ఈ ఏడాది టాప్ స్టార్టప్‌‌‌‌‌‌‌‌ల లిస్ట్‌‌‌‌‌‌‌‌లో జెప్టో మొదటి ప్లేస్‌‌‌‌‌‌‌‌ దక్కించుకోగా, స్పింటో, లుసిడిటీ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.