
Zerodha News: సోషల్ మీడియా ఇన్ ఫ్లుయన్స్ పెరిగిపోతున్న ప్రస్తుత రోజుల్లో చాలా మంది నేటి తరం యువత త్వరగా ధనవంతులు కావాలనే ఆశల్లో ఉన్నారు. ప్రధానంగా ఎక్కువగా మధ్యతరగతికి చెందిన ప్రజలు వేగంగా తమ జీవితాలను మార్చుకోవాలని, సొసైటీలో డబ్బున వారి మాదిరిగా జీవితాన్ని కంఫర్టబుల్ గా గడపాలని భావిస్తున్నారు. ఈ ప్రయాణంలో చాలా మంది అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు, ట్రేడింగ్ వంటి వాటిని ఎంపిక చేసుకుంటున్నారు. అయితే మధ్యతరగతి ప్రజలు ఎలా ధవంతులు కాగలరు అనే విషయాన్ని దేశీయ బ్రోకరేజ్ సంస్థ జెరోధా సీఈవో పంచుకున్నారు.
వేగంగా ధవంతులుగా మారటానికి అసలు షార్ట్ కట్ మార్గాలు లేవని తాజాగా జెరోధా సీఈవో నితిన్ కామత్ తన ఎక్స్ ఖాతాలో తాజాగా ఒక పోస్టులో వెల్లడించారు. అసలు ధనవంతులుగా మారాలకునేవారికి ఎక్కువ ఓపికతో పాటు క్రమశిక్షణ ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ప్రజలు అనవసర ఖర్చులను తగ్గించుకుని.. పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాలని ఆయన సూచించారు. ఈ క్రమంలో చాలా మంది మధ్యతరగతి ప్రజలు చేసే కొన్ని తప్పులను ఆయన సూచించారు. ప్రజలు అనవసరమైన వస్తువులను కొనుగోలు చేసేందుకు అప్పు చేస్తుంటారని, అలాగే సరైన హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవటంతో అనారోగ్య సమయంలో అప్పుల పాలవుతున్నారని పేర్కొన్నారు.
I often get asked for a stock tip, something that will make people rich. 😬
— Nithin Kamath (@Nithin0dha) April 10, 2025
Unfortunately, there are no shortcuts to getting rich. It takes good habits and patience. Things like buying stuff you don't need, or worse, borrowing to buy them. The other big one is not having health… pic.twitter.com/qWYaDuhZKe
తనను చాలా మంది తరచుగా ఏదైనా స్టాక్స్ టిప్స్ అడగుతుంటారని పేర్కొన్నారు. ధనవంతులు కావటానికి షార్ట్ కట్స్ ఉండవని, దానికి క్రమశిక్షణతో కూడిన మంచి అలవాట్లు అవసరమని నితిన్ కామత్ సూచించారు. ప్రస్తుతం దేశంలో చాలా మంది మధ్యతరగతి ఉచ్చులో చిక్కుకుపోతున్నారని కామత్ పేర్కొన్నారు. కష్టపడి చదవటం, పనిచేయటం, ఉద్యోగం, రుణం తీసుకుని ఇల్లు కొనటం, ఆడంబరమైన వస్తువుల కోసం డబ్బులు ఖర్చు చేయటం అనే చక్రంలో ప్రస్తుతం మధ్యతరగతి ప్రజలు చిక్కుకుపోయాని కామత్ పేర్కొన్నారు. ప్రజలు తమ డబ్బును పొదుపు, పెట్టుబడి పెట్టడం వంచి అలవాట్లకు మారాలన్నారు.
మధ్యతరగతి ట్రాప్ నుంచి బటయపడటం ఎలా..?
* నెలవారీ ఖర్చులను తగ్గించుకుని, కనీసం 1 శాతం డబ్బును ఇండెక్స్ ఫండ్స్ లాంటి వాటిలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి.
* కనీసం 6 నెలల ఖర్చులకు సరిపడా డబ్బును ఎమర్జెన్సీ ఫండ్ రూపంలో సేవ్ చేసుకోవాలి.
* హెల్త్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి.
* క్విక్ రిటర్న్స్ కోసం వెంపర్లాడకుండా క్రమశిక్షణతో పెట్టుబడులు చేయండి.