జెడ్​ఎఫ్​ లైఫ్​ టెక్ జీసీసీ షురూ

జెడ్​ఎఫ్​ లైఫ్​ టెక్ జీసీసీ షురూ

న్యూఢిల్లీ : ఆటోమోటివ్​ ఇండస్ట్రీకి సేఫ్టీ సిస్టమ్స్​ను అందజేసే జెడ్​ఎఫ్​ లైఫ్​ టెక్  గురువారం హైదరాబాద్​లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ)ని ప్రారంభించింది.  జెడ్​ఎఫ్ గ్రూప్ నుంచి జెడ్​ఎఫ్​ లైఫ్​టెక్​ను విడదీయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబరు నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నారు. ఈ జీసీసీ అందుబాటులోకి రావడం వల్ల ప్రపంచవ్యాప్తంగా మరింత బలపడతామని, భారతదేశం వెలుపల గ్లోబల్​ ఇంజనీరింగ్ అవసరాలను త్వరగా అందించగలమని జెడ్​ఎఫ్​లైఫ్​టెక్​ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రుడాల్ఫ్ స్టార్క్ అన్నారు.

జెడ్​ఎఫ్​లైఫ్​టెక్​ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవికుమార్ తిరుముకులు మాట్లాడుతూ, కేంద్రం ఆవిష్కరణలను,  భద్రతా ప్రమాణాలను ప్రోత్సహిస్తోందని అన్నారు. ఈ ఆఫీసులో 200 మందికి పైగా ఉద్యోగులు ఉంటారని తెలిపారు. కంపెనీ గత ఏడాది 4.6 బిలియన్​ డాలర్ల గ్రూప్ టర్నోవర్‌‌ను నమోదు చేసింది. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌‌బాబు ఈ కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జెడ్​ఎఫ్​ జీసీసీ ప్రారంభంతో తెలంగాణా ప్రపంచ స్థాయి సాంకేతిక, నూతన పరిశోధనల గమ్యస్థానంగా మారిందని అన్నారు. దీనివల్ల ప్రస్తుతం 200 మందికి ఉద్యోగాలు లభించాయని, వచ్చే మూడేళ్లలో ఈ సంఖ్య 500 దాటుతుందని ఆయన అన్నారు. ఇన్నోవేషన్‌లో తెలంగాణను అగ్రగామిగా నిలుపుతామని అన్నారు.