ఏ ముహూర్తాన ఐపీఎల్ టోర్నీ ప్రారంభించారో కానీ ప్రాంఛైజీ క్రికెట్ లీగులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. శ్రీలంక ప్రీమియర్ లీగ్, పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, వెస్టిండీస్ ప్రీమియర్ లీగ్, బిగ్ బాష్ క్రికెట్, అబుదాబి టీ10 లీగ్, కెనడా టీ20 లీగ్, యూఏఈ టీ20 లీగ్, మేజర్ లీగ్ క్రికెట్.. ఇలా పదుల సంఖ్యలో ప్రాంఛైజీ క్రికెట్ టోర్నీలున్నాయి. ఇవి చాలవన్నట్లు 10 రోజుల్లో మరో టోర్నీ ప్రారంభంకానుంది.
జింబాబ్వే వేదికగా 'జిమ్ ఆఫ్రో T10 లీగ్' పేరిట అంతర్జాతీయ స్టార్లతో టోర్నీ మొదలుకానుంది. జూలై 20 నుండి జూలై 29 వరకు జరిగే ఈ టోర్నీలో ఐదు జట్లు పాల్గొంటున్నాయి. ఈ లీగ్‌లో విదేశీ ఆటగాళ్లతో పాటు పలువురు భారత్, పాక్ క్రికెటర్లు సందడి చేయనున్నారు. రాబిన్ ఉతప్ప(హరారే హరికేన్స్), పార్థివ్ పటేల్ (కేప్ టౌన్ సాంప్ ఆర్మీ), యూసుఫ్ పఠాన్ (జోబర్గ్ బఫెలోస్) తరుపున బరిలోకి దిగనున్నారు.
జిమ్ ఆఫ్రో T10 2023 లీగ్ జట్లు, ఆటగాళ్లు:
డర్బన్ క్వాలండర్స్: ఆసిఫ్ అలీ, మహమ్మద్ అమీర్, జార్జ్ లిండే, హజ్రతుల్లా జజాయ్, టిమ్ సీఫెర్ట్, సిసంద మగాలా, హిల్టన్ కార్ట్‌రైట్, మీర్జా బేగ్, తయ్యబ్ అబ్బాస్, క్రెయిగ్ ఎర్విన్, టెండై చటారా, బ్రాడ్ ఎవాన్స్, క్లైవ్ మదాండే, నిక్ వెల్చ్, ఆండ్రీ ఫ్లెచర్.
కేప్ టౌన్ సాంప్ ఆర్మీ: రహ్మానుల్లా గుర్బాజ్, సీన్ విలియమ్స్, భానుకా రాజపక్సే, మహేశ్ తీక్షణ, షెల్డన్ కాట్రెల్, హామిల్టన్ మసకద్జా, కరీం జనత్, చమికా కరుణరత్నే, పీటర్ హాట్జోగ్లౌ, మాథ్యూ బ్రీట్జ్‌కే, రిచర్డ్ న్గారవ, జువావో సెఫాస్, మహ్మద్ ట్యుమ్‌టుర్షిన్, స్ఫన్‌టుర్షిన్, మహ్మద్, అకేవే, పార్థివ్ పటేల్ .
హరారే హరికేన్స్: ఇయాన్ మోర్గాన్, మహ్మద్ నబీ, ఎవిన్ లూయిస్, రాబిన్ ఉతప్ప, డోనోవన్ ఫెరీరా, షానవాజ్ దహానీ, డువాన్ జాన్సెన్, సమిత్ పటేల్, కెవిన్ కొత్తిగోడ, క్రిస్టోఫర్ మ్ఫోఫు, రెగిస్ చకబ్వా, ల్యూక్ జోంగ్వే, బ్రాండన్ మవుతా, తషింగా శ్రీసన్ పట్హాన్, ఐ స్ర్ఫా శ్రీసన్ పట్హాన్, ఐ. .
బులవాయో బ్రేవ్స్: సికందర్ రజా, తస్కిన్ అహ్మద్, అష్టన్ టర్నర్, టైమల్ మిల్స్, తిసార పెరెరా, బెన్ మెక్‌డెర్మాట్, బ్యూ వెబ్‌స్టర్, ర్యాన్ బర్ల్, పాట్రిక్ డూలీ, కోబ్ హెర్ఫ్ట్, టిమిసెన్ మారుమా, జాయ్‌లార్డ్ గుంబీ, ఇన్నోసెంట్ కైయా, ఫరాజ్ అక్రమ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్.
జోబర్గ్ బఫెలోస్: ముష్ఫికర్ రహీమ్, ఓడియన్ స్మిత్, టామ్ బాంటన్, యూసుఫ్ పఠాన్, విల్ స్మీద్, నూర్ అహ్మద్, రవి బొపారా, ఉస్మాన్ షిన్వారీ, జూనియర్ డాలా, బ్లెస్సింగ్ ముజారబానీ, వెల్లింగ్టన్ మసకద్జా, వెస్లీ మాధేవెరే, విక్టర్ న్యౌచి, మొహమ్‌మెద్ షుంబా, రాహుల్ చోప్రేజ్.