స్వదేశంలో జింబాబ్వే భారత్ తో 5 టీ20 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే భారత జట్టును ప్రకటించగా.. తాజాగా 15 మందితో కూడిన జింబాబ్వే జట్టును ఆ దేశ క్రికెట్ ఎంపిక చేసింది. వెటరన్ ఆల్ రౌండర్ సికందర్ రజా జింబాబ్వే కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. 2024 టీ20 వరల్డ్ కప్ కు జింబాబ్వే అర్హత సాధించలేకపోయింది. దీంతో కొత్త ప్రధాన కోచ్ జస్టిన్ సామన్స్ ఆధ్వర్యంలో జట్టును మళ్ళీ గాడిలో పెట్టాలని చూస్తుంది.
సికిందర్ రాజాతో పాటు టెండై చతారా, వెస్లీ మాధేవెరే, బ్రాండన్ మవుటా, డియోన్ మైయర్స్, ఇన్నోసెంట్ కైయా, మిల్టన్ శుంబాతో లాంటి కీలక ప్లేయర్లు జట్టులో ఉన్నారు. వీరందరూ సత్తా చాటాలని జింబాబ్వే కోరుకుంటుంది. ఎక్స్ పీరియన్స్ ప్లేయర్స్ క్రెయిగ్ ఎర్విన్, సీన్ విలియమ్స్ లను పరిగణలోకి తీసుకోలేదు. జింబాబ్వే కాలమాన ప్రకారం మ్యాచ్ లు మధ్యాహ్నం 1 గంటలకు.. భారత కాలమాన ప్రకారం సాయంత్రం 4:30 లకు ప్రారంభమవుతాయి.
జూలై 6 నుండి 14 వరకు ఈ సిరీస్ జరగనుంది. మొత్తం ఐదు టీ20లు హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జూలై 6, 7, 10, 13, 14 తేదీల్లో జరగనున్నాయి. 8 ఏళ్ల తర్వాత భారత జట్టు జింబాబ్వేలో పర్యటిస్తోంది. చివరి సారి ఈ ఇరు జట్ల మధ్య 2016లో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగ్గా.. భారత్ 2-0తో గెలిచింది.
Also Read:బ్యాడ్మింటన్‌లో విషాదం.. మ్యాచ్ ఆడుతూనే కుప్పకూలి చనిపోయిన చైనా ప్లేయర్
భారత్ తో టీ 20 సిరీస్ కు జింబాబ్వే జట్టు:
రజా సికందర్ (కెప్టెన్), అక్రమ్ ఫరాజ్, బెన్నెట్ బ్రియాన్, క్యాంప్‌బెల్ జోనాథన్, చటారా టెండై, జోంగ్వే లూక్, కైయా ఇన్నోసెంట్, మదాండే క్లైవ్, మాధేవెరె వెస్లీ, ముమనీ మస్రాబ్‌వానీ, మస్‌రాబ్‌లేస్, , మైయర్స్ డియోన్, నఖ్వీ అంటుమ్, నగరవ రిచర్డ్, శుంబా మిల్టన్
Zimbabwe include Naqvi in squad for T20I series against India
— Zimbabwe Cricket (@ZimCricketv) July 1, 2024
Details 🔽https://t.co/MYR4waitsL pic.twitter.com/6pIg6AYy12