క్రికెట్ దిగ్గజం కన్నుమూశాడు. జింబాబ్వే క్రికెట్ లెజెండ్ హీత్ స్ట్రీక్ చనిపోయాడు. జింబాబ్వే మాజీ కెప్టెన్, ఫాస్ట్ బౌలర్ అయిన హీత్ స్ట్రీక్ 49 ఏళ్ల వయసులో క్యాన్సర్‌తో పోరాడి కన్నుమూశాడు. జింబాబ్వే తరపున హీత్ స్ట్రీక్ 65 టెస్టులు, 189 వన్డేలు ఆడాడు. అతను 2000, 2004 మధ్య జింబాబ్వే కెప్టెన్‌గా ఉన్నాడు. టెస్టు క్రికెట్‌లో 100 కంటే ఎక్కువ వికెట్లు తీసిన ఏకైక జింబాబ్వే ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
జింబాబ్వే తరపున 12 సంవత్సరాలు ఆడిన హీత్ స్ట్రీక్..65 టెస్టుల్లో 1990 పరుగులతో పాటు 216 వికెట్లు తీశాడు. ఇక 189 వన్డేల్లో 239 వికెట్లు తీయడంతోపాటు 2943 రన్స్ చేయడం విశేషం. వెస్టిండీస్‌పై హరారేలో తన మొదటి, ఏకైక టెస్టు సెంచరీ (127*) బాదాడు. 1993లో పాకిస్తాన్‌పై అరంగేట్రం చేసిన అతను.. 2005లో రిటైర్ అయ్యాడు. అంతేకాకుండా 2007లో ఇండియన్ క్రికెట్ లీగ్ (ICL) కూడా ఆడాడు.
2021లో హీత్ స్ట్రీక్ పై ఐసీసీ నిషేధం విధించింది. స్ట్రీక్ ఐసీసీ అవినీతి నిరోధక మార్గదర్శకాలను ఉల్లంఘించాడన్న ఆరోపణలపై ఈ నిషేధం విధించారు. జింబాబ్వేతోపాటు బంగ్లాదేశ్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లకు హీత్ స్ట్రీక్ కోచ్ గానూ వ్యవహరించాడు.