IND vs ZIM 2024: 22 పరుగులకే నాలుగు వికెట్లు.. పీకల్లోతు కష్టాల్లో భారత్

IND vs ZIM 2024: 22 పరుగులకే నాలుగు వికెట్లు.. పీకల్లోతు కష్టాల్లో భారత్

హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి టీ20 లో టీమిండియాకు ఊహించని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. 116 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 5ఓవర్లలో 22 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజ్ లో కెప్టెన్ గిల్(13), జురెల్ (0) ఉన్నారు. భారత్ గెలవాలంటే మరో 15 ఓవర్లలో 94 పరుగులు చేయాల్సి ఉంది. చతారా రెండు వికెట్లు పడగొట్టాడు. బెన్నెట్, ముజరుభాని చెరో వికెట్ తీసుకున్నారు.   

లక్ష్యం చిన్నదే అయినప్పటికీ జింబాబ్వే బౌలర్లు చెలరేగారు. తొలి ఓవర్లోనే బెన్నెట్ అభిషేక్ శర్మను డకౌట్ గా వెనక్కి పంపాడు. ఆ తర్వాత ముజరుభాని వేసిన ఒక చక్కని బంతికి గైక్వాడ్(7) స్లిప్ లో దొరికిపోయాడు. అప్పుడే 2 వికెట్లు పోయి కష్టాల్లో పడిన టీమిండియాకు 5 ఓవర్లో బిగ్ షాక్ తగిలింది. పరాగ్ (2), రింకూ సింగ్ (0) ఔటయ్యారు. దీంతో భారత్ ఒక్క సారిగా 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి గెలుపు కోసం పోరాడుతుంది. కెప్టెన్ గిల్, జురెల్ పైనే టీమిండియా ఆశలు పెట్టుకుంది.