విండ్‌హోక్: ఉగాండ క్రికెట్ జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. ఆఫ్రికన్ క్వాలిఫయర్స్‌లో భాగంగా గురువారం జరిగిన ఫైనల్ రౌండ్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో రువాండాపై గెలిచి టీ20 వరల్డ్ కప్–2024కు తొలిసారి అర్హత సాధించింది. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు సాధించిన ఉగాండ.. పాయింట్ల పట్టికలో టాప్–2లో నిలిచి మెగా టోర్నీకి క్వాలిఫై అయ్యింది. ఐదు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించిన జింబాబ్వే మూడో ప్లేస్‌తో ఇంటిముఖం పట్టింది.
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రువాండ 18.5 ఓవర్లలో 65 రన్స్‌కు ఆలౌటైంది. ఎరిక్ డిసింగ్జిమానా (19) టాప్ స్కోరర్. తర్వాత ఉగాండ 8.1 ఓవర్లలో 66/1 స్కోరు చేసి నెగ్గింది. సిమోన్ సెసజాయ్ (26 నాటౌట్), రోనక్ పటేల్ (18) రాణించారు. వచ్చే ఏడాది జూన్ 4 నుంచి 30 వరకు జరిగే టోర్నీలో అమెరికా, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఇండియా, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా, శ్రీలంక, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, ఐర్లాండ్, స్కాట్లాండ్, పపువా న్యూగినియా, కెనడా, నేపాల్, ఒమన్, నమీబియా, ఉగాండ బరిలోకి దిగనున్నాయి.
మొత్తం 20 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజిస్తారు. ప్రతి గ్రూప్‌లో టాప్–2లో నిలిచిన టీమ్స్ సూపర్–8కు అర్హత సాధిస్తాయి. ఇందులో రెండు గ్రూప్స్ ఉంటాయి. ప్రతి గ్రూప్‌లో టాప్–2 నిలిచిన టీమ్స్ సెమీస్‌కు క్వాలిఫై అవుతాయి. ఇందులో నెగ్గిన రెండు టీమ్స్ ఫైనల్స్ ఆడతాయి.