భద్రత మరియు భద్రతా కారణాల దృష్ట్యా ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ ను ఎక్కడ జరుగుతుందనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతుంది. భారత్ లో నిర్వహించాలని బీసీసీఐను ఐసీసీ కోరగా దీనికి సెక్రటరీ జైషా సున్నితంగా తిరస్కరించారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ మెగా ఈవెంట్ ను నిర్వహించడానికి జింబాబ్వే ఆసక్తి చూపిస్తున్నట్టు నివేదికలు తెలుపుతున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సైతం రేస్ లో ఉన్నట్టు తెలుస్తుంది.
బీసీసీఐ సెక్రటరీ జైషా ఈ ఈవెంట్‌కు భారత్ లో నిర్వహించడం కుదరదని చెప్పడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఆగస్టు 20న జరిగే ఐసీసీ బోర్డు సమావేశం అనంతరం దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జింబాబ్వే మహిళల జట్టు ఇప్పటివరకు ఏ క్రికెట్ ప్రపంచకప్‌లో ఆడలేదు. గత 21 ఏళ్లలో జింబాబ్వేలో ఎప్పుడూ క్రికెట్ ప్రపంచకప్ జరగలేదు. జింబాబ్వే చివరిసారిగా 2003లో కెన్యా, దక్షిణాఫ్రికాతో కలిసి మెన్స్ వన్డే ప్రపంచకప్‌కు ఆతిథ్యమిచ్చింది.
10 జట్లు.. 18 రోజులు
పది జట్లు తలపడే ఈ టోర్నీ అక్టోబర్ 3-20 వరకు జరగాల్సి ఉంది. పాల్గొనే 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఏలో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, క్వాలిఫయర్ 1 ఉండగా.. ఆతిథ్య బంగ్లాదేశ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, క్వాలిఫయర్ 2 గ్రూప్-బి లో ఉన్నాయి. రెండు గ్రూపుల నుంచి టాప్-2 జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. అక్టోబర్ 20న ఫైనల్ జరగనుంది.
Zimbabwe Shows Interest in Hosting the Women's in T20 World Cup 2024 !
— STUMPSNBAILS (@stumpnbails) August 17, 2024
.
.
.
.
.#Cricket #WomensT20WorldCup #ZimbabweCricket #T20WorldCup2024 #CricketNews #WomensCricket #CricketFans #CricketUpdates #SportsNews #T20Cricket #CricketAddict #CricketCommunity #stumpsandbails pic.twitter.com/I8MRwa92vx