
సిల్హెట్: బంగ్లాదేశ్‌తో మొదటి టెస్టులో జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 57/1తో మూడో రోజు, మంగళవారం ఆట కొనసాగించిన జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 273 రన్స్ వద్ద ఆలౌటైంది. ఫలితంగా మొదటి ఇన్నింగ్స్‌లో ఆ జట్టుకు 82 రన్స్ ఆధిక్యం లభించింది. సీన్ విలియమ్స్ (59), బ్రియాన్ బెనెట్ (57) హాఫ్ సెంచరీలతో రాణించారు.
ఆతిథ్య బంగ్లా బౌలర్లలో మెహిదీ హసన్ మిరాజ్ ఐదు వికెట్లు పడగొట్టగా.. నహిద్ రాణా మూడు వికెట్లు తీశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లా మూడో రోజు చివరకు 194/4 స్కోరుతో నిలిచింది. కెప్టెన్ నజ్ముల్ శాంటో (60 బ్యాటింగ్), మోమినుల్ హక్ (47), హసన్ జాయ్ (33) రాణించారు. ముజరబాని మూడు వికెట్లు తీశాడు. ప్రస్తుతం శాంటో, జాకర్ అలీ (21 బ్యాటింగ్) క్రీజులో ఉండగా బంగ్లా 112 రన్స్ ఆధిక్యంలో కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 191 రన్స్‌కే ఆలౌటైంది.