ENG vs ZIM: జింబాబ్వేతో ఏకైక టెస్ట్.. టూరింగ్ ఫీజ్ చెల్లించడానికి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు రెడీ

ENG vs ZIM: జింబాబ్వేతో ఏకైక టెస్ట్.. టూరింగ్ ఫీజ్ చెల్లించడానికి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు రెడీ

జింబాబ్వే 2025  మే నెలలో ఇంగ్లాండ్ తో ఏకైక టెస్ట్ ఆడనుంది. ఈ టెస్ట్ కోసం జింబాబ్వే ఇంగ్లాండ్ లో పర్యటించనుండగా.. ఈ టెస్ట్ కోసం ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు జింబాబ్వే జట్టుకు టూరింగ్ ఫీజ్ చెల్లించడానికి సిద్ధమైంది. అదే జరిగితే క్రికెట్ చరిత్రలో ఒక పర్యాటక దేశానికి టూరింగ్ ఫీజ్ చెల్లించిన తొలి దేశంగా ఇంగ్లాండ్ నిలుస్తుంది. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ గౌల్డ్ శుక్రవారం (జూలై 26) ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ (ఇంగ్లాండ్, వెస్టిండీస్) మొదటి రోజు ఆట సందర్భంగా స్కై స్పోర్ట్స్‌లో చాట్ సమయంలో ఈ విషయాన్ని  ధృవీకరించారు.

సాధారణంగా టూరింగ్ జట్టు వేరే దేశంలోకి పర్యటించినప్పుడు ఖర్చు మొత్తం వారే చూసుకోవాల్సి ఉంటుంది. అయితే వచ్చే ఏడాది జింబాబ్వేతో ఆడుతున్నప్పుడు ఆ జట్టుకు ఎటువంటి రుసుము ఉండదు. మొత్తం ఇంగ్లాండ్ క్రికెట్ భరిస్తుంది. గత సంవత్సరం ఫైనల్ వరల్డ్ పోడ్‌కాస్ట్‌తో మాట్లాడిన గౌల్డ్.. వివిధ పూర్తి సభ్య దేశాలు ఆర్జించిన ఆదాయాల్లోని అసమానతలను పూడ్చేందుకు.. టెస్ట్ క్రికెట్ నాణ్యతను పటిష్టంగా ఉండేలా చూసుకోవడం అవసరమని సూచించాడు.