జింబాబ్వేలో తీవ్రకరువు: ఆకలి తీర్చేందుకు ఏనుగు మాంసం సరఫరా

జింబాబ్వేలో తీవ్రకరువు: ఆకలి తీర్చేందుకు ఏనుగు మాంసం సరఫరా

జింబాబ్వేలో నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా తీవ్రమైన కరువుతో అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎల్ నినోతో కరువు దక్షిణాఫ్రికను నాశనం చేసింది. దాదాపు 68 మిలియన్ల మంది ప్రజలు తిండి లేక అవస్థలు పడుతున్నారు. ప్రజల ఆకలి బాధను తీర్చేందుకు అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా దాదాపు 200 ఏనుగులను చంపి వాటి మాంసాన్ని ప్రజలకు పంచేందుకు సిద్దమవుతోంది. 

కరువు కారణంగా ప్రభావితం అయిన ప్రాంతాల్లో ప్రజలకు ఏనుగు మాంసాన్ని పంపిణీ చేస్తామని జింబాబ్వే పార్క్స్ వైల్డ్ లైఫ్ అథారిటీ (జింపార్క్స్ ) ప్రతినిధులు చెబుతున్నారు. 1988 తర్వాత జింబాబ్వేలో మొదటి సారి ఏనుగుల చంపడం ఇదే తొలిసారి.  ఇటీవల నమీబియాలోని హాంగ్వే, ఎంబైర్, షోలోట్షో, చిరిడ్జి వంటి ప్రాంతాల్లో కరువు ఏర్పడింది. కరువు బారిన పడిన వారికి మాంసాన్ని అందించేందుకు 83ఏనుగులను చంపి మాంసాన్ని ప్రజలకు పంపిణీ చేశారు. 

దక్షిణాఫ్రికా ఏనుగులకు ప్రసిద్ధి. జింబాబ్వే, జాంబియా, బోట్స్ వానా, అంగోళా, నమీబియా వంటి దేశాల్లో మొత్తం 2 లక్షలకు పైగా ఏనుగులు ఉన్నాయి. ప్రపంచం లోనే అతిపెద్ద ఏనుగుల జనాభాగల  ప్రాంతం దక్షిణాఫ్రికా. 

జింబాబ్వేలో ప్రస్తుం 84వేల ఏనుగులు ఉన్నాయి. జాతీయ ఉద్వాన వనాల పరిధిలో 55 వేల ఏనుగులున్నాయి. అయితే ఉద్వాన వనాలపై వన్య ప్రాణుల ఒత్తిడిని తగ్గించడం, పెరుగుతున్న మానవ- వన్యప్రాణుల సంఘర్షణలను పరిష్కరించడం లక్ష్యంగా అక్కడి ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. గతేడాది జింబాబ్వేలో ఏనుగుల దాడిలో 50 మంది చనిపోయారు.