కుర్రాళ్లతో జింబాబ్వే గడ్డపై అడుగుపెట్టిన భారత క్రికెట్ జట్టుకు తొలి టీ20 మ్యాచ్ లోనే బిగ్ షాక్ తగిలింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేజ్ చేయలేక ఆతిధ్య జింబాబ్వే చేతిలో ఘోరంగా ఓడారు. భారత బౌలర్లు అద్భుతంగా రాణించినా.. బ్యాటింగ్ లో చేతులెత్తేశారు. జింబాబ్వే బౌలర్లు సమిష్టిగా రాణించడంతో పటిష్టమైన భారత్ ను తొలి మ్యాచ్ లో 13 పరుగుల తేడాతో మట్టికరిపించింది. మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో 9 వికెట్లకు 115 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్ష్య ఛేదనలో భారత్ 102 పరుగులకే ఆలౌటైంది.
116 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో తొలి ఓవర్లోనే బెన్నెట్ అభిషేక్ శర్మను డకౌట్ గా వెనక్కి పంపాడు. ఆ తర్వాత ముజరుభాని వేసిన ఒక చక్కని బంతికి గైక్వాడ్(7) స్లిప్ లో దొరికిపోయాడు. అప్పుడే 2 వికెట్లు పోయి కష్టాల్లో పడిన టీమిండియాకు 5 ఓవర్లో బిగ్ షాక్ తగిలింది. చతార వేసిన ఈ ఓవర్లో పరాగ్ (2), రింకూ సింగ్ (0) ఔటయ్యారు. ఆ తర్వాత గిల్(31), జురెల్(7) కూడా త్వరగా ఔట్ కావడంతో భారత్ 47 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచింది. ఈ దశలో సుందర్ (27), ఆవేశ్ ఖాన్ (16) పోరాటం భారత్ విజయానికి సరిపోలేదు. జింబాబ్వే బౌలర్లలో చతారా, సికిందర్ రాజా చెరో మూడు వికెట్లు పడగొట్టాడు. బెన్నెట్, ముజరుభాని, జోంగ్వే, మసకద్జ్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ తీసుకుంది. రెండో ఓవర్లోనే ముఖేష్ కుమార్ తన తొలి బంతికి కియా (0) వికెట్ తీసి భారత్ కు శుభారంభం ఇచ్చాడు. ఈ దశలో మాధవీరె(21), బెన్నెట్(23) జింబాబ్వేను ఆదుకునే ప్రయత్నం చేశారు. ఇద్దరూ కలిసి రెండో వికెట్ కు 34 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దారు. అయితే పవర్ ప్లే చివరి ఓవర్లో స్పిన్నర్ రవి బిష్ణోయ్ రావడంతో ఆతిధ్య జట్టు ఒక్కసారిగా కుప్పకూలింది. ఇక్కడ నుంచి వరుస విరామాల్లో ఆ జట్టు వికెట్లను కోల్పోయింది.
జోనాథన్ కాంప్‌బెల్(0), క్లైవ్ మదాండే(12), ల్యూక్ జోంగ్వే(1), బ్లెస్సింగ్ ముజారబానీ(0) వరుస పెట్టి పెవిలియన్ కు చేరారు. ఆదుకుంటాడనుకున్న కెప్టెన్ సికందర్ రజా 17 పరుగులకే ఔటవ్వడంతో జింబాబ్వే 20 ఓవర్లలో 9 వికెట్లకు 115 పరుగులకే పరిమితమైంది. చివర్లో మాదందే (29) ఆదుకోవడంతో జట్టు స్కోర్ 100 పరుగులు దాటింది. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ 4 వికెట్లు తీసుకున్నాడు. వాషింగ్ టన్ సుందర్ కు రెండు వికెట్లు దక్కాయి.
In their first match since the T20 World Cup, champions India have been beaten by Zimbabwe, who had failed to qualify for the tournament #ZIMvIND
— ESPNcricinfo (@ESPNcricinfo) July 6, 2024
Cricket 🤯
▶️ https://t.co/fOjVJcJz9M pic.twitter.com/l2Cm4l3Lu9