
టెస్ట్ క్రికెట్ లో జింబాబ్వే చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. సిల్హెట్ వేదికగా బంగ్లాదేశ్ పై జరిగిన మ్యాచ్ లో మూడు వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. బుధవారం (ఏప్రిల్ 23) 174 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసి బంగ్లాదేశ్ కు షాక్ ఇచ్చింది. బంగ్లాదేశ్ వెళ్లిన జింబాబ్వే ఈ సంచలన విజయాన్ని నమోదు చేయడం విశేషం. నాలుగేళ్ల తర్వాత జింబాబ్వే టెస్టుల్లో విజయం సాధించడంతో వారి సెలెబ్రేషన్స్ ఓ రేంజ్ లో సాగాయి. చివరిసారిగా మార్చి 2021లో ఆఫ్ఘనిస్తాన్‌పై జింబాబ్వే టెస్ట్ గెలిచింది.
174 పరుగుల లక్ష్య ఛేదనలో జింబాబ్వేకు అదిరిపోయే ఆరంభం లభించింది. తొలి వికెట్ కు ఓపెనర్లు బెన్ కరన్ (44), బెన్నెట్ (54) 95 పరుగులు జోడించి విజయాన్ని ఖాయం చేశారు. అయితే ఈ దశలో బంగ్లాదేశ్ బౌలర్లు చెలరేగారు. ఒక్కసారిగా విజృంభించి వికెట్లు తీస్తాడం స్టార్ట్ చేశారు. 50 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు తీసి జింబాబ్వేను ఒత్తిడిలో పడేశారు. చివర్లో వెస్లీ మాధేవేరే(19*) జాగ్రత్తగా ఆడుతూ సంచలన విజయాన్ని అందించాడు. రెండు ఇన్నింగ్స్ ల్లో 9 వికెట్లు పడగొట్టిన బ్లెస్సింగ్ ముజారబానీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
బంగ్లా మూడో రోజు 4 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసిన బంగ్లాదేశ్ 255 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ నజ్ముల్ శాంటో (60 బ్యాటింగ్) ఓవర్ నైట్ స్కోర్ వద్ద ఔటయ్యాడు. ముజారబానీ 6 వికెట్లు తీసుకోగా.. చివర్లో లోయర్ ఆర్డర్ ను వెల్లింగ్టన్ మసకడ్జా పెవిలియన్ కు పంపాడు. అంతక ముందు జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 273 రన్స్ వద్ద ఆలౌటైంది. ఫలితంగా మొదటి ఇన్నింగ్స్‌లో ఆ జట్టుకు 82 రన్స్ ఆధిక్యం లభించింది. సీన్ విలియమ్స్ (59), బ్రియాన్ బెనెట్ (57) హాఫ్ సెంచరీలతో రాణించారు. బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్ లో 191 రన్స్‌కే ఆలౌటైంది. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్ లో జింబాబ్వే 1-0 ఆధిక్యంలో నిలిచింది.
Zimbabwe get over the line in the fading light to clinch a thrilling win against Bangladesh in Sylhet!https://t.co/l6vMxpknWO #BANvZIM pic.twitter.com/YsuQTiaF8r
— ESPNcricinfo (@ESPNcricinfo) April 23, 2025