
శ్రీనగర్: పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి ఓ వీడియో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. జిప్‌లైన్‌పై రైడ్ చేస్తున్నప్పుడు ఓ టూరిస్టు తీసుకున్న సెల్ఫీ వీడియోను ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ‘అల్లాహూ అక్బర్’ అంటూ మూడు సార్లు జిప్‌లైన్ ఆపరేటర్ అనడం..ఆ తర్వాతే కాల్పులు ప్రారంభం కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ జిప్ లైన్ ఆపరేటర్ ను విచారించేందుకు ఎన్ఏఐ సమన్లు జారీ చేసింది.
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ఒక వీడియోలో "అల్లాహు అక్బర్" అని జిప్‌లైన్ ఆపరేటర్ అరుస్తున్నట్లు కనిపిస్తుంది. ఆతర్వాత కాల్పులు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. దీనిపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ,జమ్మూ కాశ్మీర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన సమయంలో అక్కడున్న పలువురిని విచారణకు పిలిచినట్టు తెలుస్తోంది.
దాడి తర్వాత సంఘటన స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరినీ దర్యాప్తు సంస్థలు విచారణ కోసం పిలిపించాయని వర్గాలు తెలిపాయి. జిప్‌లైన్ ఆపరేటర్‌ను విచారణకు పిలిపించి ఏజెన్సీలు అతనిని విచారించాయి. పహల్గామ్ నుంచి రిషి భట్ అనే వ్యక్తి రికార్డ్ చేసిన వీడియో ఆన్‌లైన్‌లో కనిపించిన తర్వాత NIA విచారణ చేపట్టింది.