వారఫలాలు ( సౌరమానం ) జూలై 7 నుంచి 13 వరకు

వారఫలాలు ( సౌరమానం ) జూలై 7 నుంచి 13 వరకు

మేషం

రాబడి సంతృప్తినిస్తుంది. సన్నిహితులతో వివాదాలు తీరి సఖ్యత నెలకొంటుంది. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాల పరిష్కారంలో చొరవ. విద్యార్థులకు ఉత్సాహాన్నిచ్చే ఫలితాలు. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు. చిన్ననాటి స్నేహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వాహనసౌఖ్యం. వ్యాపారులకు కొద్దిమొత్తంలో లాభాలు. ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రశంసలు. వారాంతంలో అనుకోని ప్రయాణాలు.

వృషభం

ఆదాయం ఆశాజనకం. స్నేహితులతో వివాదాల పరిష్కారం. శుభవార్తలు వింటారు. కీలక నిర్ణయాలకు తగిన సమయం. విద్యార్థులకు అనుకూల పరిస్థితులు. కొత్త వ్యక్తుల పరిచయం. ముఖ్య కార్యాలు విజయవంతం. భూములు, వాహనాల కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారులకు ఊహించని లాభాలు. ఉద్యోగులకు ముఖ్య సమాచారం అందుతుంది. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు.

మిథునం

ముఖ్యమైన కార్యాలు శ్రమానంతరం పూర్తి. ఆదాయం సంతృప్తికరం. స్థిరాస్తి వివాదాలను నేర్పుతో పరిష్కరించుకుంటారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వాహన, కుటుంబ సౌఖ్యం. ఆస్తి విషయంలో కొత్త అగ్రిమెంట్లు. ప్రముఖులు పంపిన సందేశంతో ఊరట చెందుతారు. వ్యాపారులకు కోరుకున్న లాభాలు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు రాగలవు. రాజకీయవేత్తలకు విదేశీయానం. వారాంతంలో ఆకస్మిక ప్రయాణాలు.

కర్కాటకం

ఆశించిన ఆదాయం సమకూరుతుంది. కొత్త కార్యాలకు శ్రీకారం చుడతారు. వివాహాది వేడుకల నిర్వహణలో పాలుపంచుకుంటారు. కొన్ని వివాదాలు అత్యంత చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతన వ్యక్తుల పరిచయం. వ్యాపారులకు పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. వారం మధ్యలో దూరప్రయాణాలు.

సింహం

పరిస్థితులు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలు పొందుతారు. కొన్ని సమస్యలు నేర్పుతో పరిష్కారం. వాహన సౌఖ్యం. ప్రముఖుల పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. కొన్ని కార్యాలు సకాలంలో పూర్తి. ఇంటి నిర్మాణాలు చేపడతారు. ఆలోచనలకు కార్యరూపం. అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపారులకు లాభాలు తథ్యం. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. వారారంభంలో దూరప్రయాణాలు.

కన్య

ఊహించని విధంగా రాబడి ఉంటుంది, అప్పులు తీరి ఊరట చెందుతారు. కొన్ని కార్యాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆశయాలు నెరవేరతాయి. భూములు, వాహనాలు కొంటారు. విద్యార్థులకు ఇంటర్వ్యూలు అందుతాయి. మీ నిర్ణయాలు అందరూ ప్రశంసిస్తారు. ప్రముఖులు పరిచయమవుతారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. పారిశ్రామికవేత్తల, కళాకారుల ఊహలు నిజం కాగలవు. 

తుల

ముఖ్యమైన కార్యాల్లో స్వల్ప ఆటంకాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలతో ఇబ్బందిపడతారు.  కుటుంబసభ్యులతో విభేదాలు. ముఖ్య నిర్ణయాలు వాయిదా. ఇంటి నిర్మాణాలలో ప్రతిబంధకాలు. ఆదాయం కొంత తగ్గినా అవసరాలకు లోటు ఉండదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. వ్యాపారులకు లాభాలు దక్కినా చికాకులు తప్పకపోవచ్చు. ఉద్యోగులకు విధుల్లో ఆటుపోట్లు. వారారంభంలో విందులు, వినోదాలు. వస్తులాభాలు.

వృశ్చికం

కొన్ని కార్యక్రమాల్లో జాప్యం జరిగినా ఎట్టకేలకు పూర్తి కాగలవు. బంధువులతో విభేదాలు తొలగుతాయి. పోగొట్టుకున్న వస్తువులు దక్కే ఛాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. కొన్ని ఆశయాలు నెరవేరతాయి. విద్యార్ధులకు అనుకున్న అవకాశాలు. వాహన, కుటుంబ సౌఖ్యం. వ్యాపారులకు నూతనోత్సాహం, కొత్త పెట్టుబడులు. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. కోరుకున్న మార్పులు ఉండవచ్చు. వారం మధ్యలో అనుకోని ప్రయాణాలు.

ధనస్సు

రావలసిన సొమ్ము అందుతుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరే సమయం. చేపట్టిన కార్యాలు విజయవంతం. ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు. విద్యార్థులకు ఊహించని ఫలితాలు. స్నేహితులతో ఉత్తరప్రత్యుత్తరాలు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారులు పెట్టుబడులకు తోడు లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు గుర్తింపు.

మకరం

అదనపు రాబడి. సన్నిహితులు, స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. నిరుద్యోగులకు  కోరుకున్న ఉద్యోగాలు. చేపట్టిన కార్యాలు దిగ్విజయంగా సాగుతాయి. కొత్త వాహనాలు కొంటారు. వ్యాపారులకు మరింత ఉత్సాహం, భాగస్వాముల సహకారం అందుతుంది. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. రాజకీయవేత్తలకు ఆదరణ పెరుగుతుంది. కళాకారులకు సన్మానాలు.

కుంభం

కొత్త కార్యాలు సకాలంలో  పూర్తి. అందరిలో తగిన గుర్తింపు. నిరుద్యోగులు, విద్యార్థులు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాలు తుది పరిష్కారం. ఇంటి నిర్మాణాలు మొదలుపెడతారు. పెట్టుబడులు సమకూరి కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగులకు ఎంతోకాలంగా ఎదురవుతున్న చిక్కులు తొలగుతాయి. వారాంతంలో దూరప్రయాణాలు.

మీనం

ఎంతోకాలంగా ఎదురవుతున్న కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. మీ ఆశయాలు నెరవేరతాయి. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. కొన్ని కార్యాలు విజయవంతంగా పూర్తి.  వాహనసౌఖ్యం. ముఖ్య నిర్ణయాలు. ఆలోచనలు అమలు చేస్తారు. శత్రువులు కూడా మీపట్ల సానుకూలత వ్యక్తం చేస్తారు. వ్యాపారులకు ఆశించిన లాభాలు. ఉద్యోగులకు విధుల్లో ప్రోత్సాహం. వారం మధ్యలో అనుకోని ప్రయాణాలు.

వక్కంతం చంద్రమౌళి
జ్యోతిష్య పండితులు
ఫోన్​: 98852 99400