ఆకాశంలో అద్భుతం చోటు చేసుకోనుంది. గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతున్న సమయంలో ఒకానొక సందర్భంలో ఒకే సరళరేఖలోకి వస్తుంటాయి. వీటిని ప్లానెటరీ కంజెంక్షన్ (గ్రహాల సంయోగం)గా అభివర్ణిస్తుంటాం. కుజుడు, గురుడు, సూర్యునికి దగ్గరగా ఉండే రెండు గ్రహాలు , శుక్రుడు, శని ఈ గ్రహాలు ఒకే చోటుకు రాబోతున్నారు. జనవరి 21 నుంచి ఫిబ్రవరి 21 వరకు నెల రోజులు ఆరు గ్రహాలు ఆకాశంలో ఒకదానితో ఒకటి కలిసిపోయినట్లు, లేదా పక్కపక్కన ఉన్నట్లు కనిపిస్తుంటాయి. ఈ గ్రహాలు ఇలా రావడం వలన కొన్ని రాశుల వారి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇప్పుడు ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. . . .
మేషరాశి: ఆరు గ్రహాలు ఒకే ఒకే సరళరేఖలోకి రావడం వలన మేష రాశి వారికి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని పండితులు చెబుతున్నారు. ఈ నెల రోజుల పాటు ( జనవరి 21 నుంచి ఫిబ్రవరి 21 వరకు) కొత్త ప్రాజెక్టులను ప్రారంభించకుండా ఉండాలని సూచిస్తు్న్నారు. ఎవరితోను ఎలాంటి వాదనలు పెట్టుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులు గడ్డు కాలాన్ని ఎదుర్కొంటారు. ఆర్థిక పరమైన ఒత్తిడిలు.. మనశ్శాంతి లేక పోవడం వంటివి జరిగే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
వృషభరాశి: ఈ రాశి వారికి కుజుడు, గురుడు, సూర్యునికి దగ్గరగా ఉండే రెండు గ్రహాలు (యురేనస్, నెప్ట్యూన్) శుక్రుడు, శని గ్రహాలు ఒకే చోటికి రావడం వలన అదృష్టం కలసి వస్తుంది. ఏ పని చేపట్టిన ఆటంకం లేకుండా కొనసాగుతుంది. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులు కార్యాలయంలో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఆర్థికపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. అయితే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు.
మిథునరాశి: పైన తెలిపిన ఆరు గ్రహాల అమరిక వలన జ్యోతిష్య శాస్త్రంప్రకారం.. ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలుంటాయి. ప్రతి పనిలోనూ కష్టపడాల్సి ఉంటుంది. ఆర్థికంగా వృద్ది చెందడంతో పాటు.. ఖర్చులు కూడా పెరుగుతాయి. కొంతమందని నమ్మి మోసపోయే పరిస్థితులు ఉంటాయి. పెళ్లి విషయాన్ని వాయిదా వేసుకోండి. వ్యాపారస్తులకు పెద్దగా లాభాలు రాకపోయినా నష్టం ఉండదు. ఇక విద్యార్థుల విషయానికొస్తే కష్టపడాల్సి ఉంటుంది. అయితే గురు గ్రహం పైన తెలిపిన గ్రహాల్లో ఉండటం వలన పెద్దగా ఇబ్బందులు ఉండవలని జ్యోతిష్య పండితులు అంటున్నారు.
కర్కాటకరాశి : కుజుడు, గురుడు, సూర్యునికి దగ్గరగా ఉండే రెండు గ్రహాలు (యురేనస్, నెప్ట్యూన్) శుక్రుడు, శని గ్రహాలు ఒకే చోటుకు రావడం వలన కర్కాటక రాశి వారి జీవితంలో చాలా మార్పులు వస్తాయి. దూర ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒకటి.. రెండు చోట్ల ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా.. అవి జరగకపోవడం వలన జీవితంలో స్థిరత్వం సాధిస్తారు. నిరుద్యోగులకు ఆలస్యంగా ఉద్యోగం లభిస్తుంది. ఈ రాశి వారు చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. ఇప్పటి వరకు మిమ్మలను వ్యతిరేకించిన వారు మీ దగ్గరకే వస్తారు. ఆర్ధికంగాఎలాంటి ఇబ్బందులు ఉండవు. పెళ్లి.. ప్రేమ వ్యవహారాలు కలసి వస్తాయి. పూర్వీకుల ఆస్థి కలసి రావడంతో కొత్త వస్తువులుల కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది.
సింహరాశి: ఈ రాశి వారు కొత్త విషయాలపై ఆశక్తి చూపుతారు. కొత్త ప్రాజెక్ట్ లు చేపట్టి విజయం సాధిస్తారు. టీమ్ లీడర్ గా చక్కని అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరగడానికి కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నిర్ణయాలు.. మీ జీవితానికి టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగంతో పాటు.. జీతం కూడా వచ్చే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాలు కలసి వస్తాయి. వ్యాపారస్తులు అనుకోకుండా కొత్త వెంచర్ ను ప్రారంభిస్తారు. ఈ రాశి వారికి అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది.
కన్యారాశి: ఆరు గ్రహాల కూటమి కన్యారాశి వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తుంది. దీంతో ఖర్చులు కూడా పెరుగుతాయి. ప్రతి పనికి ఆందోళన పడతారు కాని చివరకు శుభవార్తలే వింటారు, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న వివాదాలు తొలగిపోతాయి. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేకపోయినా అప్పుల వారు కొంత వేధింపులకు గురిచేస్తారు. కుటుంబసభ్యుల కారణంగా కొన్ని అనవసర ఖర్చులు వస్తాయి. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలుంటాయి. లాభాలు లేక పోయినా నష్టాలు మాత్రం ఉండదు. కొత్త పెట్టుబడులు పెట్టే ఆలోచనను విరమించుకోండి. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలకు ఈ నెల రోజులు దూరంగా ఉండటమే మంచిదని పండితులు సూచిస్తున్నారు.
తులారాశి: ఈ రాశి వారు జనవరి 21 నుంచి ఫిబ్రవరి 21 వరకు ప్రతి చిన్న పని కూడా వేరొకరిపై ఆధారపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ..కొద్దిగా ఇబ్బంది కలిగించినా చివరకు సంతృప్తి చెందుతారు. ఆదాయం, ఆరోగ్యం చాలావరకు బాగానే ఉంటాయి. ఇంటా బయటా అను కూలతలు వృద్ధి చెందుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. వ్యాపారాల్లో సొంత ఆలోచనల వల్ల లాభం ఉంటుంది. వృత్తి జీవితంలో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక ప్రయ త్నాలన్నీ సఫలమవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిదని పండితులు సూచిస్తున్నారు.
వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఫిబ్రవరి 21 వరకు చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరగడంతో పాటు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది, నిరుద్యోగులు శుభవార్త వింటారు. పెళ్లి సంబంధం చూసే వారికి అనుకోకుండా మంచి మ్యాచ్ కుదురుతుంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వ్యాపారస్తులు గణనీయమైన లాభాలు సాధిస్తారు. అయితే వృశ్చిక రాశి వారికి అనుకోకుండా ఖర్చులు పెరుగుతాయి.
ధనస్సురాశి: ఈ రాశి వారికి పైన తెలిపిన ఆరు గ్రహాల కూటమి అంత అనుకూలంగా లేదు, ప్రతి పనిలోను కొన్ని చికాకుల ఏర్పడుతాయి. కాని గురుగ్రహం అనుకూలంగా ఉండటం వలన ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆర్థికపరంగా కొన్ని ఒడిదుడుకులు ఏర్పడే అవకాశం ఉంది. నిరుద్యోగులు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడును. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఒత్తిళ్ళు అధికముగా ఉండును. వ్యాపార రంగంలో ఉన్న వారు కొత్తగా పెట్టుబడుడుల పెట్టకపోవడమే మంచిది. ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా చేసుకోవాలని పండితులు సూచిస్తు్న్నారు. ఎవరికి అప్పులు ఇవ్వడం కాని.. హామీగా ఉండటం కాని చేయవద్దని పండితులు సూచిస్తున్నారు
మకరరాశి : ఈ రాశి వారికి ఫిబ్రవరి 21 వరకు చాలా అనుకూలంగా ఉంది. కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు, ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. ప్రతి పనిని ఎంతో బాధ్యతగా నిర్వహిస్తారు. మకరరాశికి చెందిన ఉద్యోగస్తులకు వేతనం పెరిగే అవకాశం ఉంది. ఆపీసులో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలని పండితులు సూచిస్తు్న్నారు. అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఉద్యోగం మారాలనుకునే వారికి ఇది మంచి సమయం. వ్యాపారస్తులకు అధికంగా లాభాలు వస్తాయి. కొత్త పెట్టుబడులు.. కొత్త వెంచర్లు ప్రారంభిస్తారు.
కుంభరాశి: ఈ రాశి వారు ఫిబ్రవరి 21 వరకు ఆర్ధిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. సమాజంలో కీర్తి.. గౌరవం పెరుగుతాయి. అనుకోకుండా కొన్ని విపత్కర పరిస్థితులు ఏర్పడుతాయి. ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. నెల రోజుల పాటు ఎవరితోను వాదనలు పెట్టుకోకుండా మీపని మీరు చేసుకోండి. అంతా మంచే జరుగుతుంది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే కొద్దిగా నష్టాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త పెట్టుబడుల జోలికి అసలు వెళ్లవద్దని పండితులు అంటున్నారు.
మీనరాశి: జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ రాశి వారు వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకుంటారు. కొన్ని ముఖ్యమైన ప్రాజెక్ట్ లు పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. ఉద్యోగం మారేందుకు అనుకూలమైన సమయం. ప్రేమ.. పెళ్లి విషయంలో మంచి నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారస్తులకు అన్ని విధాల కలసి వస్తుంది.