డెలివరీ పార్టనర్స్ కోసం జొమాటో రెస్ట్ పాయింట్స్
అన్ని కంపెనీల వారూ ఉపయోగించుకోవచ్చు
న్యూఢిల్లీ : ఎండ, వానలను తట్టుకుంటూ పనిచేసే డెలివరీ రంగంలోని గిగ్ వర్కర్ల వెల్ఫేర్ కోసం చొరవ తీసుకుంటున్నట్లు జొమాటో సీఈఓ దీపిందర్గోయెల్ వెల్లడించారు. వివిధ కంపెనీలకు డెలివరీ పార్ట్‌నర్స్‌గా పనిచేసే వారి కోసం రెస్ట్ పాయింట్స్ పేరుతో పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయనున్నట్లు ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో ప్రకటించింది. గుర్గావ్లో ఇప్పటికే ఇలాంటి రెస్ట్పాయింట్స్ పనిచేస్తున్నాయని, మరిన్ని రెస్ట్పాయింట్స్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నామని జొమాటో సీఈఓ దీపిందర్ గోయెల్ ఒక బ్లాగ్‌పోస్టులో వెల్లడించారు.
ఈ రెస్ట్పాయింట్స్లో క్లీన్ డ్రింకింగ్ వాటర్, ఫోన్ఛార్జింగ్ స్టేషన్లు, వాష్‌రూమ్స్, హైస్పీడ్ ఇంటర్నెట్, 24 గంటలపాటూ హెల్ప్‌డెస్క్, ఫస్ట్ ఎయిడ్ సపోర్ట్ వంటి సదుపాయాలు ఉంటాయని పేర్కొన్నారు. అయితే ఎన్ని రెస్ట్ పాయింట్స్ ఏర్పాటు చేస్తారనేది మాత్రం గోయెల్ చెప్పలేదు. డెలివరీ పార్ట్నర్లు ఎదుర్కొనే సవాళ్లు తమకు తెలుసని, అందుకే ఈ చొరవ తీసుకుంటున్నామని గోయెల్ చెప్పారు. డెలివరీ పార్ట్నర్స్ వెల్ఫేర్ కోసం షెల్టర్ ప్రాజెక్టు చేపట్టామని, దాని కిందే ఈ రెస్ట్ పాయింట్స్ ఏర్పాటు చేస్తామని అన్నారు. కాగా, దేశంలోని గిగ్ ఎకానమీలో 77 లక్షల మంది పనిచేస్తున్నట్లు అంచనా.