Zomato CEO: పాపం జొమాటో సీఈవో.. డెలివరీ బాయ్స్ బాధలు ఇట్లనే ఉంటయ్ మరి..!

Zomato CEO: పాపం జొమాటో సీఈవో.. డెలివరీ బాయ్స్ బాధలు ఇట్లనే ఉంటయ్ మరి..!

గురుగ్రాం: ఫేమస్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో కంపెనీ సీఈవో దీపేందర్ గోయల్కు గురుగ్రామ్లోని ఆంబియన్స్ మాల్లో చేదు అనుభవం ఎదురైంది. జొమాటో కస్టమర్ ఒకరు ఆంబియన్స్ మాల్లో ఉన్న హల్దీరామ్స్ నుంచి ఫుడ్ ఐటమ్ ఆర్డర్ చేశారు. ఆ ఆర్డర్ తీసుకుని కస్టమర్కు డెలివరీ ఇచ్చేందుకు జొమాటో డెలివరీ బాయ్గా ఆ సంస్థ సీఈవో ఆంబియన్స్ మాల్కు వెళ్లారు. అయితే ఆ మాల్ మెయిన్ డోర్ దగ్గరే జొమాటో డెలివరీ బాయ్ డ్రెస్లో ఉన్న దీపేందర్ గోయల్ను మాల్ సిబ్బంది ఆపేశారు. మాల్లోకి వెళ్లేందుకు అనుమతి నిరాకరించారు.

 

మాల్ ఎంట్రీలో ఉన్న మెట్ల దగ్గరే కూర్చుని జొమాటో సీఈవో నిరీక్షించాల్సి వచ్చింది. లోపలికి అనుమతించిన తర్వాత కూడా ఆయనకు ఇబ్బందులు తప్పలేదు. లిఫ్ట్లోకి ఆయనను అనుమతించలేదు. థర్డ్ ఫ్లోర్లో ఉన్న హల్దీరామ్కు చేరుకున్నా అక్కడ కూడా బయటే ఆపేశారు. జొమాటో డెలివరీ బాయ్స్ ఎదుర్కొంటున్న కష్టనష్టాలను, సాధకబాధకాలను అర్థం చేసుకునేందుకు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని జొమాటో సీఈవో డిసైడ్ అయ్యారు. అందుకే ఇలా జొమాటో డెలివరీ బాయ్గా రంగంలోకి దిగి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకున్నారు.

డెలివరీ బాయ్స్దే ముందిలే.. అక్కడ ఆర్డర్ తీసుకుంటారు.. ఇక్కడ ఇచ్చేస్తారు.. అని చాలా మంది భావిస్తుంటారు. కానీ.. డెలివరీ బాయ్ జాబ్ అంత సులువైందేం కాదు. ఊహించని అవమానాలు, చీత్కారాలు ఆ ఉద్యోగంలో సర్వ సాధారణం. ఆర్డర్ లేట్ అయిందని కస్టమర్ల కసుర్లు, ఆర్డర్ త్వరగా తీసుకునేందుకు రెస్టారెంట్కు వెళ్తే అక్కడి యాజమాన్యం విసుర్లు. అదే.. ఇలా ఏదైనా మాల్లో ఉన్న హోటల్ లేదా రెస్టారెంట్ ఆర్డర్ అయితే కొన్ని సందర్భాల్లో ఇలా ఎంట్రీకి కూడా నిరీక్షించాల్సిన పరిస్థితి. ఆర్డర్ చేసిన కస్టమర్ పదో ఫ్లోర్లో ఉండొచ్చు. చాలా అపార్ట్మెంట్స్లో, మాల్స్లో డెలివరీ బాయ్స్కు లిఫ్ట్లోకి ఎంట్రీ ఉండదు. అయినప్పటికీ ఆర్డర్ చేసిన కస్టమర్ను ఎన్నో ఫ్లోర్ అయినా సరే.. మెట్లు ఎక్కి రొప్పుకుంటూ, ఆయాసపడుతూ అయినా చేరుకుని తీరాల్సిందే. 

ALSO READ | Health tips: రోజూ 30 నిమిషాల వాకింగ్తో ఎంతో ఆరోగ్యం..ఎక్కువ బెనిఫిట్స్ పొందాలంటే 6మార్గాలు

ఇలా.. జొమాటో డెలివరీ బాయ్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుని వీలైనంత వరకూ సంస్థ తరపున వాటిని తగ్గించేందుకు ఏం చేయొచ్చో ఆలోచన చేయాలని జొమాటో సీఈవో ఫిక్స్ అయి.. ఇలా డైరెక్ట్గా ఫీల్డ్లోకి దిగారు. జొమాటో సీఈవో భార్య గ్రేసియా మునోజ్ కూడా డెలివరీ గర్ల్గా మారి భర్త అడుగుజాడల్లో నడిచారు. జొమాటో సీఈవో, ఆయన భార్య ఇద్దరూ డెలివరీ పార్ట్నర్స్గా ఆర్డర్స్ తీసుకోవడం మొదలుపెట్టారు.