జొమాటో పేరు మారిందా.. కొత్త పేరు మీకు తెలుసా..!

జొమాటో పేరు మారిందా.. కొత్త పేరు మీకు తెలుసా..!

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో పేరు మారింది.. అవును ఈ విషయాన్ని ఆ కంపెనీనే అఫీషియల్ గా ప్రకటించింది. ఇకపై జొమాటో ఎటర్నల్‌ పేరుతో అందుబాటులో ఉంటుందని ప్రకటించింది సంస్థ. ఈ మేరకు గురువారం ( ఫిబ్రవరి 6, 2025 ) స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌ కూడాఅయినట్లు తెలిపింది జొమాటో. బ్లింకిట్‌ను కొనుగోలు చేసిన క్రమంలో, బ్రాండ్ కి యాప్ కి మధ్య ఇంటర్నల్ గా తేడా గుర్తించటం కోసమే ఎటర్నల్ గా పేరు మార్చినట్లు తెలిపింది జొమాటో. 

ALSO READ | ATM నుంచి డబ్బులు డ్రా చేస్తున్నారా.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

జొమాటోకు మించి ఏదో ఒక వ్యాపారం మా భవిష్యత్తుకు ముఖ్యమైనగా మారిన రోజు మేము కంపెనీ పేరును ఎటర్నల్‌గా మార్చాలని అనుకున్నాముని లేఖలో పేర్కొన్నారు. ఇండియాలో సెన్సెక్స్ చేరిన మొదటి స్టార్టప్ కావడం గర్వంగా ఉందని.. ఈ ఘనత తమ బాధ్యతను మరింత పెంచిందని తెలిపింది జొమాటో. తమ యూజర్లు పేరులో మార్పును గమనించాలని పేర్కొంది జొమాటో.మార్చిన పేరుకు వాటాదారుల నుండి ఆమోదం పొందిన వెంటనే వెబ్సైట్, స్టాక్ టిక్కర్ లో తమ సంస్థ పేరు జొమాటో నుండి ఎటర్నల్ గా మారుతుందని తెలిపింది. 

ఇకపై ఎటర్నల్ జొమాటోకుపేరెంట్ కంపెనీగా ఉంటుందని... దీనికి సంబంధించి నాలుగు ప్రధాన వ్యాపారాలు ఉంటాయని తెలిపింది జొమాట... వాటిలో.. జొమాటో, బ్లింకిట్, డిస్ట్రిక్ట్, హైపర్ ప్యూర్ ఉండనున్నాయని తెలిపింది. ఎటర్నల్ అనే పేరు ఒక గొప్ప బాధ్యతను సూచిస్తుందని, మన మరణమే మన అమరత్వానికి కారణమని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే, మనం నిజంగా చిరస్థాయిగా నిలుస్తామని సూచిస్తుందని పేర్కొంది జొమాటో.