బతుకు బండికి లైసెన్స్

వరంగల్‍, వెలుగు: రెగ్యులర్‍.. ప్రొఫెషనల్‍, ఏ డిగ్రీ చదివినా ఈ రోజుల్లో జాబ్‍ వస్తుందనే గ్యారెంటీ లేదు. కానీ, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలు ఏదో ఒక పని దొరుకుతుంది. ఇప్పుడు సర్వీస్‍ సెక్టార్‍లో కొత్తరకం ఉపాధి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ‘డెలివరీ బాయ్‍’ ఉద్యోగాల కు చాలా డిమాండ్‍ ఉంటోంది. వరంగల్‍ లాంటి టైర్‍ టూ సిటీస్‍లో ఏకంగా ఐదు వేల మంది వరకు డెలివరీ బాయ్స్‌గా ఉపాధి పొందుతున్నారు. మంచి చదువులు చదివితే మంచి ఉద్యోగం గ్యారెంటీ.. ఇది ఒకప్పటి మాట. అయితే చదువుకున్నవాళ్ల సంఖ్య బాగా పెరగడం, ప్రభుత్వ ఉద్యోగాలు పరిమితంగా ఉండడం, అన్ని ప్రాంతాల్లో పారిశ్రామీకరణ జరగకపోవడం వంటి కారణాల వల్ల చాలామందికి ఉపాధి దొరకడంలేదు. హైదరాబాద్‍ మినహా ఇతర ప్రాంతాల్లో పని దొరకడం చాలా కష్టం. అందుకే డిగ్రీ, ఇంజనీరిం గ్‍ పట్టా పొందగానే ఆర్థిక స్తోమత ఉన్నవాళ్లు ప్రభుత్వ ఉద్యోగాల కోసం కోచింగ్‍ సెంటర్లకు వెళ్తున్నారు.

ఇంకొందరు అదృష్టం వెతుక్కుంటూ నగరాల బాట పడుతున్నారు. బాగా స్థిరపడిన కుటుంబాల్లో పిల్లలు ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్తున్నారు. దిగువ మధ్య తరగతి యువకులు మాత్రం ఉన్నఊళ్లోనే ఏదో ఒకపని చేస్తున్నారు. ఈ కుటుంబాల్లో చాలామంది ప్రైవేటు రంగాల్లో చిన్న స్థాయి ఉద్యోగాలు చేస్తున్నారు. హైదరాబాద్‍ మినహా వరంగల్‍ లాం టి టైర్‍ టూ సిటీతో పాటు కరీంనగర్‍, నిజామాబాద్‍, ఖమ్మం వంటి పాత జిల్లా కేంద్రాలు, కొత్తగా జిల్లా కేం ద్రాలైన జనగామ, భువనగిరిలో కూడా నిన్నమొన్నటి వరకు ఇదే పరిస్థితి.

డెలివరీ బాయ్స్ విద్యార్హత ప్రామాణికంగా కాకుండా డ్రైవింగ్‍ లైసెన్స్ కే ప్రాధాన్యం ఇచ్చే ‘డెలివరీ బాయ్‍’జాబ్ లు టైర్‍టూతో పాటు జిల్లా కేం ద్రాలు, పట్టణాల్లో యువతకు కొత్త ఉపాధి మార్గంగా మారాయి. డ్రైవింగ్​ లైసెన్స్ , ఒక బైకు, ఇంగ్లీషు చదవడం, రాయడంతో పాటు ‘గుడ్ మార్నింగ్‍ సార్‍, థ్యాం కు సార్‍’.. ఇలా నాలుగు మాటలు మర్యాదగా మాట్లాడితే చాలు. ఇవే ఈ ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు. పార్ట్ టైం .. ఫుల్‍ టైం, మొత్తం మూడు షిప్టుల్లో పనులు అప్పగిస్తున్నాయి కంపెనీలు. నెలకు కనీసం ఐదు వేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయల వరకు వేతనం ఇస్తున్నాయి. వీటికి తోడుగా పెట్రోలు అలవెన్సు, వర్క్ ఇన్సెంటీవ్స్ ఉంటాయి. దీంతో దిగువ మధ్య తరగతి, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన యువకులు ఈ ఉద్యోగాల్లో చేరేందుకు ఇష్టపడుతున్నారు. ఒక్క వరంగల్‍ నగరంలోనే ఐదు వేల మంది డెలివరీ బాయ్స్ పని చేస్తున్నారు. ఇందులో కొరియర్‍ సంస్థలకు చెందిన వాళ్లు రెండు వేల మంది ఉంటే మిగిలిన వాళ్లు స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ కంపెనీల్లో పని చేస్తున్నారు.

ఇక ఫ్లిప్ కార్ట్, అమెజాన్‍ వంటి సంస్థలు భూపాలపల్లి, జనగామ వంటి సెంటర్లలో స్టో ర్లను ఏర్పాటు చేసుకుని తమ కస్టమర్లకు సేవలు అందిస్తున్నాయి. ఇలా పట్ణణాల్లోనూ ఆన్ లైన్‍ అమ్మకాలు విస్తరిం చడంతో అక్కడా డెలివరీ బాయ్స్ అవసరం పెరుగుతోంది. వరంగల్ ..వరంగల్‍కు ఎడ్యుకేషన్‍ హబ్ గా కూడా గుర్తింపు ఉంది. నగర పరిధిలో 32 డిగ్రీ, పీజీ కాలేజీలు, 13 ఇంజనీరిం గ్‍ కాలేజీలు, 14 ఫార్మసీ కాలేజీలు, 27ఎంబీఏ కాలేజీలు, 6 ఎంసీఏ కాలేజీలు, 8 బీఈడీ కాలేజీలు, 2 లా కాలేజీలు ఉన్నాయి. వీటిలో ప్రతీ ఏడు కనీసం ఏడువేల మంది చదువు పూర్తి చేసుకుని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో చాలామందికి ప్రైవేటు రంగంలో స్కూళ్లు, ఆస్పత్రుల్లో చిన్న చిన్న పనులు తప్ప వైట్‍ కాలర్‍ ఉద్యోగాలు దొరకడం లేదు. దీంతో వాళ్లంతా ఉపాధి కోసం హైదరాబాద్‍కు వెళ్లక తప్పడం లేదు. ఇలాం టి సమయంలో ఆన్ లైన్‍ మార్కె ట్‍ విస్తృ తమై వాళ్లకు ఉపాధి మార్గం చూపించింది. నగరంలో స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్ కార్ట్, అమెజాన్‍ వంటి సంస్థల్లో డెలివరీ బాయ్ ద్యోగాలు రెడీగా ఉన్నాయి. ఇవి కాకుం డా పిజ్జా హట్‌, కేఎఫ్ సీ వంటి ఫుడ్‌ కంపెనీలు కూడా డెలివరి బాయ్స్ ని రిక్రూట్​ చేసుకుంటున్నాయి.

వీటికి తోడు ఈ మధ్యే ఓలా, ర్యాపిడో వంటి మొబిలిటీ సర్వీసులు కూడా వరంగల్‌లో మొదలయ్యాయి. డ్రైవింగ్‍ లైసెన్స్ ఉన్నవాళ్లకు సంస్థలే వెహికిల్​ లోన్ ఇప్పించి ఉపాధి కల్పిస్తున్నాయి. పార్ట్ టైం , ఫుల్‍ టైం ఇష్టం వచ్చినప్పుడు పని చేసే అవకాశం ఉండటంతో యువత ఈ ఉద్యోగాల వైపు మక్కువ చూస్తున్నారు. ‘డిగ్రీ తర్వాత ఉద్యోగం కోసం హైదరాబాద్‌లో ఆరు నెలలు కోచిం గ్‍ తీసుకున్నా. అయినా జాబ్‍ రాలేదు. బైక్‍, డ్రైవింగ్‍ లైసెన్స్ ఉండటంతో వరంగల్​కు వచ్చి జొమాటోలో చేరాను. రోజుకు నాలుగు గంటలు పని చేస్తున్నా. వారానికి మూడు వేలు వస్తున్నాయి. నా ఖర్చులకు సరిపోతున్నాయి. మిగిలిన సమయంలో జాబ్ కు ప్రిపేర్‍ అవుతున్నా’ అని వరంగల్‍కి చెందిన అభిషేక్‍ చెప్పాడు. ఇదే ఉపాధి వరంగల్‍లో ఒకప్పుడు అజాం జాహీ మిల్లు ఉండేది. ఇందులో మూడు షిప్టుల్లో పది వేల  మంది కార్మి కులు పని చేసేవాళ్లు. నిర్వహణ లోపాలతో వచ్చిన నష్టా ల వల్ల మూత పడింది. ఆ తర్వాత అంత పెద్ద కంపెనీ ఒక్కటి కూడా

ఇక్కడ స్థాపిం చలేదు. వ్యాగన్‍ వర్క్ షాప్‍ ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగా ఎనిమిదేళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత దేశంలోనే అతిపెద్ద టెక్స్ టైల్స్ పార్కు ను వరంగల్‍లో నిర్మి స్తున్నారు. ఇందులో ప్రత్యక్షంగా పదివేల మందికి ఉపాధి దొరుకుతుందని ప్రభుత్వం చెబుతోంది. దాంతో యువకులు దీని పై ఆశలు పెట్టకున్నారు. కానీ, శంకుస్థాపన జరిగి ఏడాదిన్నర గడిచినా ఇప్పటి వరకు ప్రహరీ, పునాదుల దశలోనే పార్కు పనులు ఉన్నాయి. 2016లో ఐటీ ఇంక్యుబేషన్‍ ప్రారంభమైనా చెప్పుకోతగ్గ మార్పు రాలేదు. ఇలాం టి సమయంలో వరంగల్‍ యువతకు డెలివరీ బాయ్‍ జాబ్స్ ఉపాధి కల్పిస్తున్నాయి.

ఒత్తిడి లేదు కన్వీనియంట్ గా ఉన్న టైంలో పని చేయవచ్చు. వర్క్ చేయాలని అనిపించినప్పుడు లాగిన్‍ అవుతాం. వేరే పనులు ఉన్నప్పుడు, హెల్త్ బాగాలేనప్పుడు లాగిన్‍ కాకపోతే చాలు. ఒత్తిడి లేకుండా పార్ట్ టైంగా పని చేస్తూ డబ్బు సంపాదించవచ్చు. – నవీన్‍

వారానికి రెండు వేలు

స్విగ్గీలో డెలివరీ బాయ్‍గా పని చేస్తున్నా. టైం ఉన్నప్పుడు లాగిన్ అవుతాను. పీక్‍ అవర్స్ లో రెండు గంటలు పని చేస్తే వారానికి రెండు వేల వరకు ఈజీగా వస్తాయి. ఖాళీ సమయాల్లో పరీక్షలకు ప్రిపేర్ అవొచ్చు. మరో పని చేసుకోవచ్చు.

–-అరవింద్‍