జొమాటో ఫాండర్‌‌‌‌‌‌‌‌కు మళ్లీ పెళ్లి!

జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయెల్  మెక్సికన్‌‌‌‌ మోడల్‌‌‌‌, ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రెనూర్‌‌‌‌‌‌‌‌ గ్రేసియా మునోజ్‌‌‌‌ను పెళ్లి చేసుకున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 41 ఏళ్ల గోయెల్‌‌‌‌కు ఇది రెండో పెళ్లి.  మొదట కాంచన జోషిని ఆయన వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ  ఐఐటీ ఢిల్లీలో కలిసి చదువుకున్నారు.  ‘గ్రేసియా ఇండియాలో ఉంటున్నారు. లగ్జరీ కన్జూమర్ సెగ్మెంట్‌‌‌‌లో ఓ స్టార్టప్‌‌‌‌ పెట్టారు.

ఆమె గతంలో మోడల్‌‌‌‌గా చేశారు. గోయెల్‌‌‌‌కు గ్రేసియాకు రెండు నెలల కిందటే పెళ్లయ్యింది’ అని ఈ విషయం తెలిసిన వ్యక్తి ఒకరు వెల్లడించారు. ‘మెక్సికాలో పుట్టాను. ప్రస్తుతం ఇండియాలోని  ఇంటిలో ఉంటున్నాను’ అని  గ్రేసియా ఇన్‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌ బయో ఉంది. 2022 లో మెట్రోపోలిటిన్‌‌‌‌ ఫ్యాషన్ వీక్ విన్నర్‌‌‌‌‌‌‌‌గా ఆమె నిలిచారు కూడా.