జొమాటోకు రూ.803 కోట్ల GST నోటీసులు.. జనం దగ్గర వసూలు చేస్తున్నారు కదా.. !

జొమాటోకు రూ.803 కోట్ల GST నోటీసులు.. జనం దగ్గర వసూలు చేస్తున్నారు కదా.. !

జొమాటో.. జొమాటో.. కస్టమర్ల దగ్గర మాత్రం పైసాతో సహా వసూలు చేస్తుంది.. సర్వీసు ఛార్జీలు, జీఎస్టీనే కాదు.. ఫ్లాట్ ఫాం ఛార్జీలు, ఫీడింగ్ ఛార్జీలు అంటూ ఆర్డర్ వ్యాల్యూకు ఏ మాత్రం తక్కువ కాకుండా పైసాతో సహా వసూలు చేస్తుంది. ముందే డబ్బులు కట్టించుకుని.. ఆ తర్వాత డెలివరీ ఇస్తుంది.. ఏ మాత్రం నష్టం లేదు.. ఏ మాత్రం వేస్టేజీ లేదూ.. అలాంటి జొమాటో ప్రభుత్వానికి మాత్రం 803 కోట్ల రూపాయల జీఎస్టీ ఎగ్గొట్టిందంట.. ఈ మాట జీఎస్టీ వాళ్లే అంటున్నారు.. 803 కోట్ల రూపాయల పన్నుకు సంబంధించి జీఎస్టీ నోటీసులు ఇవ్వటం ఇప్పుడు కలకలం రేపుతోంది. మరి కస్టమర్ల దగ్గర వసూలు చేసిన డబ్బంతా ఎటుపోతుంది.. ఏమైపోతుంది అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు..

అసలు విషయం ఏంటంటే.. జొమాటో సంస్థ 2019 అక్టోబర్ 29 నుండి 2022 మార్చి 31 వరకు  కాలానికి సంబంధించిన జీఎస్టీ ఎగవేతకు సంబంధించి నోటీసులు పంపింది జీఎస్టీ శాఖ. ఎగ్గొట్టిన పన్ను, అందుకు సంబందించిన వడ్డీ, జరిమానా వెరసి రూ. 803 కోట్లుగా ఉన్నట్లు తెసులుస్తోంది. అయితే.. ఇందుకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించేందుకు జొమాటో సిద్దమైనట్లు తెలిపింది. ఈ మేరకు అపీల్ దాఖలు చేయనున్నట్లు తెలిపింది జొమాటో.

Also Read : ఎయిర్ పొల్యూషన్​తో ఏటా 15 లక్షల మంది మృతి

జొమాటో పన్ను ఎగవేతకు సంబందించిన వార్తలు వైరల్ అవ్వడంతో ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. తమ నుండి డెలివరీ చార్జెస్, హ్యాండ్లింగ్ చార్జెస్ అంటూ రకరకాల పేర్లు పెట్టి వసూలు చేస్తున్న సొమ్మంతా ఏం చేస్తోందంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్. జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేయటమే మానేయాలని.. కస్టమర్లను దోచుకొని జీఎస్టీ ఎగ్గొడుతున్న జొమాటో లాంటి సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్స్.