జొమాటోలో ఉద్యోగాలు.. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. విద్యార్హ‌త అవ‌స‌రం లేదు..

వికారాబాద్​, వెలుగు : జొమాటోలో ఉద్యోగాల కోసం జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీస్​, ఐటీఐ క్యాంపస్ వికారాబాద్​ లో ఈ నెల 12న ఉదయం  10:30 గంటలకు ‘జాబ్ మేళా’ ను నిర్వహిస్తున్నట్లు   జిల్లా ఉపాధి కల్పనా అధికారి షేక్ అబ్దుస్ సుభాన్ మంగళవారం ఒక ప్రకటన తెలిపారు.  

జొమాటో లో సుమారు 50 డెలివరీ బాయ్​ పోస్టులు ఉన్నాయని, 18 ఏండ్ల నిండిని వారంతా అర్హులని తెలిపారు. ఈ ఉద్యోగానికి స్మార్ట్ ఫోన్ అవసరమని, విద్యా అర్హత అవసరం లేదని ఆయన అన్నారు.  వివరాలకు  మియా సాబ్ 9676047444 ను  ఫోన్​లో కాంటాక్ట్​ చేయొచ్చని తెలిపారు.