జొమాటోతో NSE ఒప్పందం

జొమాటోతో NSE ఒప్పందం

న్యూఢిల్లీ: అసంఘటిత రంగ కార్మికులకు ఆర్థిక అక్షరాస్యత, పెట్టుబడులపై అవగాహనను పెంచడానికి ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్ జొమాటోతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఈ) మంగళవారం తెలిపింది. దీనికింద  జొమాటో డెలివరీ వర్కర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన  ఆర్థిక అక్షరాస్యత,  పెట్టుబడిదారులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 

ఇది దేశవ్యాప్తంగా 50వేల మంది గిగ్ వర్కర్ల జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతుందని ఎన్​ఎస్ఈ ఒక ప్రకటనలో తెలిపింది. వ్యక్తిగత ఫైనాన్స్ నిర్వహణ, పెట్టుబడికి సంబంధించిన ప్రాథమిక అంశాలు, బడ్జెట్, పొదుపు, రుణ నిర్వహణ,  బీమా వంటివి నేర్పిస్తారు. కార్మికుల మాతృభాషలోనే బోధన ఉంటుందని ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఈ చీఫ్ బిజినెస్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ ఆఫీసర్ శ్రీరామ్ కృష్ణన్ తెలిపారు.   జొమాటో ఫుడ్ డెలివరీ సీఈఓ రాకేష్ రంజన్ మాట్లాడుతూ, డెలివరీ భాగస్వాములు ఆర్థికంగా ఎదిగేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పారు.