జొమాటోలో ఉద్యోగుల తొలగింపు..600 మంది ఔట్​

 జొమాటోలో ఉద్యోగుల తొలగింపు..600 మంది ఔట్​

న్యూఢిల్లీ:  ఫుడ్​డెలివరీ సంస్థ జొమాటో 600 మంది కస్టమర్ సపోర్ట్ అసోసియేట్‌‌లను తొలగించింది. వీరిలో చాలా మంది సర్వీసు ఏడాదిలోపే ఉంది. కంపెనీకి మూడో క్వార్టర్​లో లాభాలు ఏడాది లెక్కన 57శాతం తగ్గాయి. క్విక్ కామర్స్ విభాగం బ్లింకిట్​కూ నష్టాలు పెరుగుతున్నాయి.  జొమాటో అసోసియేట్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్  కింద 1,500 మంది ఉద్యోగులను నియమించింది. వీరిలో 600 మంది కాంట్రాక్టులను రద్దు చేసింది.