న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో గత డిసెంబరుతో ముగిసిన మూడో క్వార్టర్లో రూ.59 కోట్ల నికర లాభం సంపాదించింది. ఏడాది క్రితం మూడో క్వార్టర్లో వచ్చిన లాభం రూ.139 కోట్లతో పోలిస్తే ఇది 57 శాతం తక్కువ. ఫుడ్ డెలివరి మాత్రం సీక్వెన్షియల్‌గా రెండు శాతం, ఏడాది లెక్కన 17 శాతం పెరిగిందని కంపెనీ షేర్ హోల్డర్లకు వెల్లడించింది.
కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఆపరేషన్స్ నుంచి రూ.5,402 కోట్లు వచ్చాయి. ఏడాది క్రితం రూ.3,288 కోట్లు వచ్చాయి. తాజా క్వార్టర్లో ఖర్చులు మాత్రం ఏడాది లెక్కన రూ.3,383 కోట్ల నుంచి రూ.5,533 కోట్లకు పెరిగాయి.