న్యూఢిల్లీ: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో లిమిటెడ్ సెప్టెంబర్ 30, 2024తో ముగిసిన రెండవ క్వార్టర్లో రూ. 176 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ. 36 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని నమోదు చేసింది.
కంపెనీ బోర్డు, ఈక్విటీ షేర్ల క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ ద్వారా రూ. 8,500 కోట్ల సమీకరణకు కూడా ఆమోదం తెలిపిందని జొమాటో లిమిటెడ్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. కార్యకలాపాల ద్వారా కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.4,799 కోట్లుగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది రూ.2,848 కోట్లుగా ఉంది. సమీక్షిస్తున్న క్వార్టర్లో మొత్తం ఖర్చులు రూ.4,783 కోట్లుగా ఉండగా, అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో రూ.3,039 కోట్లుగా నమోదయ్యాయి.