జోనల్‌‌ స్థాయి ఆటల పోటీలు ప్రారంభం

ఏటూరునాగారం, వెలుగు : స్టూడెంట్లు చదువుతో పాటు, ఆటల్లోనూ రాణించాలని ఐటీడీఏ పీవో అంకిత్‌‌ సూచించారు. బుధవారం ఏటూరునాగారంలోని కుమ్రంభీం గ్రౌండ్‌‌లో నిర్వహించిన జోనల్‌‌ స్థాయి ఆటల పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన వారిని కిన్నెరసానిలో జరిగే స్టేట్‌‌ లెవల్‌‌ ట్రైబల్‌‌ మీట్‌‌కు పంపించనున్నట్లు చెప్పారు. స్టూడెంట్లు క్రీడా స్ఫూర్తిని కలిగి ఉండాలన్నారు.

ఆటల పోటీలకు భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్, జనగాం జిల్లాల నుంచి సుమారు 1900 మంది స్టూడెంట్లు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏటూరునాగారం, మహబూబాబాద్‌‌ డీడీలు పోచం, ఎర్రయ్య, జీసీసీ డీఎం ప్రతాప్‌‌రెడ్డి, ఏటీడీవో దేశీరాం, ఏసీఎంవోలు రవీందర్‌‌, శ్రీరాములు, స్పోర్ట్స్​ఆఫీసర్స్​ఆదినారాయణ పాల్గొన్నారు.