మడికొండలో జోనల్ ​స్థాయి సైన్స్​ఫెయిర్

కాజీపేట, వెలుగు: సోషల్​ వెల్ఫేర్​ సంస్థ ఆధ్వర్యంలో మూ రోజుల పాటు నిర్వహిస్తున్న జోనల్ లెవల్ సైన్స్ ఫెయిర్ ప్రదర్శనలు గురువారం హనుమకొండ జిల్లా మడికొండ గర్ల్స్ స్కూల్​లో ప్రారంభమయ్యాయి. సైన్స్​ఫెయిర్​ను వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్​ ప్రారంభించారు. హనుమకొండ, వరంగల్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల నుంచి 22 బాలుర, 37 బాలికల స్కూళ్లకు చెందిన 236 మంది స్టూడెంట్లు వారి ఎగ్జిబిట్లను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సైన్స్​ఫెయిర్ వల్ల స్టూడెంట్లలో క్రియేటివిటీ పెరుగుతుందన్నారు.

స్టూడెంట్లు బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్,  సైన్స్ అండ్ టెక్నాలజీ, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, ఆర్ట్ అండ్ లిటరేచర్, మ్యాచ్ ఇన్ ఎవ్రీ డే లైఫ్ అనే ఐదు అంశాలపై ఎగ్జిబిట్లను ప్రదర్శించి వాటి గురించి వివరించారు. ఆర్ట్ అండ్ లిటరేచర్ లో భాగంగా మడికొండ సోషల్ వెల్ఫేర్ స్కూల్ కు చెందిన భూమిక, హర్షిత, శైనీ మరుగున పడుతున్న ప్రాచీన నృత్యకళలను నేటి యువతకు తెలియజేసే ప్రయత్నం చేశారు. హరికథ, ఒగ్గుకథ, యక్షగానం, కొలనుపాక భాగవతం, తోలు బొమ్మలాట వంటి 40 ఫోక్ ఆర్ట్స్ కళా రూపాలను ప్రదర్శించి వివరాలను తెలియజేశారు.  సైన్స్ అండ్ టెక్నాలజీలో కరీంనగర్ సైనిక్​ స్కూల్ కు చెందిన స్టూడెంట్లు ఇన్నోవేషన్ అండ్ సస్టేయినబుల్ డెవలప్​మెంట్ థీమ్ తో తయారు చేసిన వర్కింగ్ మోడల్ ఆఫ్ రాకెట్ ప్రాజెక్ట్ ఆకట్టుకుంది.