టాటా హౌస్‌కు చెందిన ప్రీమియం ఆభరణం బ్రాండ్ జోయా, తన తాజా కలెక్షన్‌ను అలైవ్ పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. అడవిపూల అందం నుంచి ప్రేరణ పొంది వీటిని తయారు చేశామని ప్రకటించింది. సృజనాత్మక డిజైన్, సిగ్నేచర్ బ్లూమ్ కట్ దీని ప్రత్యేకతలు.
ఈ నగలను ప్రచారం చేయడానికి నటి సోనమ్ కపూర్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నామని టాటా తెలిపింది. ఈ కలెక్షన్లో వజ్రాభరణాలు, ఉంగరాలు, నెక్లెస్‌ల వంటివి ఉంటాయి. ఈ కార్యక్రమంలో సోనమ్, టైటాన్ చీఫ్ డిజైన్ ఆఫీసర్ రేవతీ కాంత్ పాల్గొన్నారు.