- జడ్పీ సీఈవో చందర్‌నాయక్
సదాశివనగర్, వెలుగు: ఉపాధి హామీ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ సీఈవో చందర్‌నాయక్ అన్నారు. మంగళవారం సదాశివనగర్ మండలం ఉత్తునూర్ లో పశువులపాక, యాచారం, తిమ్మోజివాడి గ్రామాల్లో ఉపాధి హామీ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా పాలన, ప్రజా విజయోత్సవాలు, రాజ్యంగ దినోత్సవం సందర్భంగా మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకంలో కొత్త పనులను ప్రారంభించామన్నారు. ఈ సందర్భంగా వంద రోజులు పనులు పూర్తి చేసిన కూలీలను సన్మానించినట్లు తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీడీవో సంతోష్ కుమార్, ఎంపీవో సురేందర్ రెడ్డి, ఎంపీసీ చైర్మన్ సంగ్యా నాయక్, ఎపీవో శ్రీనివాస్, ఈసీ మధు, కార్యదర్శి రాహుల్ గౌడ్, ఫీల్డ్ అసిస్టెంట్మొగుళ్ల నర్సాగౌడ్, మాజీ ఎంపీటీసీ రాంచందర్‌రావు తదితరులుపాల్గొన్నారు. .