నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: జంతువుల సంరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా గుర్తించాలని జడ్పీ సీఈవో ఉష కోరారు. మంగళవారం నాగర్ కర్నూల్ క్రీడా మైదానంలో జంతు సంక్షేమ పక్షోత్సవాల్లో భాగంగా ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జంతువుల సంక్షేమం కోసం ప్రభుత్వం జంతు హింస నివారణ చట్టం తెచ్చిందని, ఆ చట్టం గురించి తెలుసుకోవాలన్నారు. జంతువులు, పక్షులను హింసిస్తే చట్ట ప్రకారం శిక్ష పడుతుందన్నారు. డీఈవో గోవిందరాజులు, రమాదేవి, కృష్ణారెడ్డి, లత, శేఖర్ బాబు, హనుమంత్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, జహీర్ పాల్గొన్నారు.