
ధర్మసాగర్, వెలుగు: వేసవిలో తాగునీటికి సమస్యలు లేకుండా చూడాలని జడ్పీ సీఈవో విద్యాలత అన్నారు. శుక్రవారం ధర్మసాగర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని సందర్శించి, రికార్డులను తనిఖీ చేశారు. కార్యాలయం వద్ద నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇంటి నమూనా, మండల కేంద్రంలోని నర్సరీని పరిశీలించారు.
తాగునీటి వసతుల పరిశీలనలో భాగంగా ధర్మసాగర్ ఓహెచ్ఆర్, నర్సింగరావుపల్లి ఓహెచ్ఆర్ గ్రామపంచాయతీలో నిర్వహిస్తున్న తాగునీటి వసతికి సంబంధించిన రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఆమెవెంట ఎంపీడీవో కె.అనిల్ కుమార్, ఆర్ డబ్ల్యూఎస్ డీఈఈ చందునాయక్, ఎంపీవో ఆఫ్జల్ తదితరులు ఉన్నారు.