ప్రజలంతా బీఆర్ఎస్​ వెంటే : బండ నరేందర్ రెడ్డి

నల్గొండ అర్బన్, వెలుగు : కొందరు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్లను నోట్ల కట్టలతో మభ్యపెట్టి కాంగ్రెస్​లో చేర్చుకున్నంత మాత్రాన నష్టమేమీ లేదని, ప్రజలంతా బీఆర్ఎస్​ వెంటే ఉన్నారని జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌‌‌‌లో ఎమ్మెల్సీ రవీందర్​రావు, అభ్యర్థి కంచర్ల భూపాల్​రెడ్డి, బీఆర్​ఎస్​ నేతలు డాక్టర్​ చెరుకు సుధాకర్, చాడ కిషన్​రెడ్డితో కలిసి ప్రెస్‌‌‌‌మీట్ పెట్టి మాట్లాడారు. 20 ఏండ్లుగా నియోజకవర్గాన్ని ఏలిన పాలకులు అభివృద్ధిని పట్టించుకోలేదని మండిపడ్డారు.

అండర్ గ్రౌండ్ డ్రైనేజీని  అసంపూర్తిగా వదిలేశారని, ప్రజలకు తాగునీటి సౌకర్యం కూడా కల్పించలేదన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి  ఎప్పుడు ఏం మాట్లాడుతాడో.. ఆయనకే తెలియదని విమర్శించారు. భూపాల్‌‌‌‌ రెడ్డి గెలిచాకే నల్గొండ అభివృద్ధి చెందిందని,  పార్టీకి ద్రోహం చేసి వెళ్లిపోయిన వారికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. 

కేసీఆర్‌‌‌‌‌‌‌‌పై అవినీతి మరక వేసే కుట్ర

సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌పై అవినీతి మరక వేయాలని కాంగ్రెస్  కుట్ర చేస్తోందని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు మండిపడ్డారు. రాహుల్ గాంధీ, రేవంత్ సుద్ద పూసల్లా మాట్లాడుతున్నారని, తమ పబ్బం గడుపుకోవడానికి ఎంత నీచానికైనా ఒడిగడుతారని ఆరోపించారు.  చెరుకు సుధాకర్ మాట్లాడుతూ.. కేసీఆర్‌‌‌‌‌‌‌‌పై  రాహుల్ గాంధీవి పసలేని ఆరోపణలని, ఎవరో రాసి ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని విమర్శించారు.

కాంగ్రెస్‌లో తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని, అవి తట్టుకోలేకనే బీఆర్ఎస్‌‌‌‌లో చేరానన్నారు. కోమటిరెడ్డి  సంస్కారం లేని వ్యక్తి అని, బీసీలను అనగదొక్కి  పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు.   మున్సిపల్​ చైర్మన్​ మందడి సైదిరెడ్డి,  నాయకులు చాడ కిషన్ రెడ్డి, పూల రవీందర్​, పంకజ్​ యాదవ్, మాలే శరణ్యారెడ్డి, బక్క పిచ్చయ్య, నిరంజన్ వలీ, అభిమన్యు శ్రీనివాస్​, బకరం వెంకన్న, సింగం లక్ష్మీ, రామ్మోహన్‌, దేవేందర్​, జయప్రద ఉన్నారు.