నందిపేట, వెలుగు : మండల కేంద్రంలోని కస్తూర్బా స్కూల్ ను మంగళవారం జడ్పీ చైర్మన్దాదన్నగారి విఠల్రావుఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కూల్లోని రికార్డులు పరిశీలించి స్టూడెంట్ల సంఖ్యను, సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వంట గదిని పరిశీలించారు. స్టూడెంట్లకు మెనూ ప్రకారం రుచికరమైన భోజనం పెట్టాలని సిబ్బందిని ఆదేశించారు. స్కూల్ఆవరణలో మురికినీరు నిలువ ఉండడంపై ఆయన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ALSO READ :సీఎం, ఎమ్మెల్యేల జీతాలు పెంచినప్పుడు.. పంచాయతీ కార్మికులకు ఎందుకు పెంచరు? : జేఏసీ నాయకులు
సీజనల్ వ్యాధులు రాకుండా ఉండేందుకు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలనే తెలియదా అంటూ మండిపడ్డారు. బాత్రూముల్లో ఎప్పటికప్పుడు బ్లీచింగ్చేయించాలని ప్రిన్సిపల్ శాంతికి సూచించారు. ఆయన వెంట ఎంపీవో కిరణ్, కోఆప్షన్ సభ్యుడు సయ్యద్హుస్సేన్, మాజీ సర్పంచ్మదారొద్దీన్, హుస్నొద్దీన్ తదితరులు ఉన్నారు.