
ఇల్లెందు,వెలుగు : ఇల్లెందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జడ్పీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య కాంగ్రెస్ హైకమాండ్ నుంచి బీఫామ్ అందుకున్నారు. ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం ఆయనకు బీఫామ్ ను అందజేశారు. ఇల్లెందు నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరం కనకయ్యను ఆదరించి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు.