ఆదిల్​పేటలో అంబేద్కర్​ విగ్రహావిష్కరణ

కోల్​బెల్ట్, వెలుగు: అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని మంచిర్యాల జడ్పీ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి పిలుపునిచ్చారు. మందమర్రి మండలం ఆదిల్​పేట గ్రామ చౌరస్తాలో ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని బుధవారం ఆమె ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అంబేద్కర్ జీవితాన్ని నేటి సమాజం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అంబేద్కర్ రాజ్యాంగంలో ప్రవేశపెట్టిన ఆర్టికల్-3 కారణంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు. దళితులకు రిజర్వేషన్లు తీసుకొచ్చి వారి అభివృద్ధికి పాటుపడ్డారని కొనియాడారు.