లారీ ఓనర్స్​కు జడ్పీ చైర్మన్ మద్దతు

కాగజ్ నగర్, వెలుగు : కాగజ్ నగర్ లోని ఎస్పీఎం కంపెనీ జేకే యాజమాన్యం మొండి వైఖరికి నిరసనగా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెన్న కిశోర్ బాబు పద్దెనిమిది రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ దీక్షకు జిల్లా ఇన్​చార్జి జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు, కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్​చార్జి రావి శ్రీనివాస్ శనివారం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జేకే యాజమాన్యం స్థానిక లారీ డ్రైవర్ ఓనర్స్ కు తీరని అన్యాయం చేస్తోందని, యాజమాన్యం దిగి వచ్చేవరకు మ మద్దతు ఉంటుందన్నారు. యాజమాన్యం మొండి వైఖరి వీడాలని కోరారు. దీక్షలో లారీ ఓనర్స్ తదితరులు పాలొగన్నారు.