ములుగు, వెలుగు : ములుగులో గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమని, సీఎం కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలే పార్టీని గెలిపిస్తాయని జడ్పీ చైర్‌పర్సన్, బీఆర్‌ఎస్ క్యాండిడేట్ బడే నాగజ్యోతి ధీమా వ్యక్తం చేశారు. ములుగు జిల్లా కేంద్రంతో పాటు గోవిందరావుపేట మండలం చల్వాయిలో శుక్రవారం ప్రచారం నిర్వహించారు.
ముందుగా గట్టమ్మకు మొక్కులు చెల్లించిన అనంతరం ప్రేమ్‌నగర్, ములుగులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ములుగును జిల్లా, మున్సిపాలిటీ, మెడికల్ కాలేజీ, మల్లంపల్లిని మండలం ఇచ్చిన కేసీఆర్‌కు గెలుపును కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని ఇళ్లు లేదన్నారు. రెడ్కో చైర్మన్ వై.సతీశ్‌రెడ్డి, బీఆర్‌ఎస్ లీడర్లు అజ్మీర ధరం సింగ్, మండల అధ్యక్షుడు బాదం ప్రవీణ్, పట్టణ అధ్యక్షుడు చెన్న విజయ్, ఎంపీటీసీ గొర్రె సమ్మయ్య, రాణాప్రతాప్ పాల్గొన్నారు.