నారాయణపేట/వెలుగు : మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల్లో సోమవారం ప్రజా ఆశీర్వాద సభలకు సీఎం కేసీఆర్ వస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. నారాయణపేట జడ్పీ చైర్పర్సన్వనజ అధికార పార్టీకి గుడ్‌బై చెప్పి, ఆదివారం హైదరాబాద్‌లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కొంత కాలంగా మక్తల్ఎమ్మెల్యే చిట్టెం రాంమ్మెహన్రెడ్డి వ్యవహారశైలిపై బీఆర్ఎస్ నాయకుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.
రాంమ్మోహన్‌రెడ్డికి టికెట్ ఇవ్వవద్దని అసమ్మతి నేతలు హైకమాండ్‌కు అల్టిమేటం ఇచ్చారు. అయినా, రాంమ్మెహన్రెడ్డినే అభ్యర్థిగా ప్రకటించడంతో నేతలంతా ‘మక్తల్ బచావో’ నినాదంతో హైదరాబాద్‌లో మీటింగ్ పెట్టుకున్నారు. హైకమాండ్‌ను కలిసి ఆయన టికెట్రద్దు చేయాలని కోరారు. పట్టించుకోకపోవడంతో అసంతృప్త నేతలంతా తమ దారి తాము చూసుకుంటున్నారు.
జడ్పీ చైర్పర్సన్ వనజ ఉమ్మడి జిల్లాలోని ఓ మంత్రి సాయంతో మక్తల్ టికెట్ కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో నిరాశలో ఉన్న ఆమె.. చిట్టెం రాంమ్మోహన్రెడ్డిని ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో బీసీ నేత, కాంగ్రెస్అభ్యర్థి వాకిటి శ్రీహరికి మద్దతుగా తన భర్త ఆంజనేయులు గౌడ్‌తో కలిసి ఆదివారం బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. అంతకుముందు మక్తల్‌లోని పడమటి ఆంజనేయస్వామిని దర్శించుకున్న వనజ, ఆంజనేయులు గౌడ్అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి భారీ కాన్వాయ్‌తో హైదరాబాద్ తరలివెళ్లారు.