
రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ వ్యవస్థ నామమాత్రంగా మారిపోయింది.అధికార వికేంద్రీకరణ కాగితాలకేపరిమితమైపోయింది. కేంద్రం నుంచి బీఆర్ ఎఫ్,14వ ఫైనాన్స్ నిధులు నిలిచిపోవడం, రాష్ట్ర బడ్జెట్ నుంచిఅతితక్కువ కేటాయింపులతో..ఇటు నిధుల్లేక, అటు అధికారాల్లేకఅలంకార ప్రాయంగా మారిపోయింది.కేంద్రం నుంచి యథావిధిగానిధులివ్వాలని, 73వ రాజ్యాంగ సవరణలోపేర్కొన్న 29 అధికారాలను జిల్లా, మండలపరిషత్ లకు బదలాయించాలనిడిమాండ్లు వస్తు న్నాయి .
గ్రామాల్లో మళ్లీ ఎన్నికల సందడి మొదలైంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ తో ఆశావహుల హడావుడి ఎక్కువైంది. 2014లో జరిగిన పరిషత్ఎన్నికల్లోనూ ఇలాగే చాలా మంది ఎంపీటీసీలు, జడ్పీటీసీ అభ్యర్థులుగా బరిలో నిలిచారు. అప్పుడు గెలిచినవారి ఐదేళ్ల పదవీ కాలం ముగింపుకు వచ్చింది. తీరా ఇప్పుడు వారు వెనక్కి తిరిగి చూసుకుంటే చెప్పుకోవడానికి ఒక్క పనీ కనిపించడం లేదు. కారణం..జిల్లా, మండల పరిషత్ లకు అధికారాలూ లేవు,నిధులూ లేవు. మండల, జిల్లా పరిషత్‌ల పరిధిలోకి ప్రభుత్వంలోని 29 విభాగాలను తీసుకొస్తూ 1993లోచేసిన 73వ రాజ్యాంగ సవరణ కాగితాలకే పరిమితమైంది. చట్టం ఇచ్చిన ఆ అధికారాలేవీ ఇప్పటికీ బదలాయించకపోవడంతో స్థానిక సంస్థలు అలంకారప్రాయంగా మారాయి. తమకు నిధులు మంజూరుచేయకపోవడాన్ని నిరసిస్తూ.. అధికార, ప్రతిపక్షాలనే తేడాలేవీ లేకుండా ఎంపీటీసీ సభ్యులంతా అనేకసార్లు నిరసన వ్యక్తం చేశారు. పనులకు నిధులివ్వాలని డిమాండ్ చేశారు. అయినా మండల పరిషత్‌లకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసిన దాఖలాలు లేవు.
పైసల్లేవ్ ..
రాష్ట్రంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థఅమల్లో ఉంది. మొదటి అంచెలోని గ్రామ పంచాయతీల పరిస్థితే మెరుగ్గా ఉంది. రెండు, మూడో అంచెల్లోని మండల, జిల్లా పరిషత్‌లు వెలవెలబోతున్నాయి. గతంలో కేంద్రం నుంచి ఈ మూడు విభాగాలకు బీఆర్ జీఎఫ్ నిధులు, ఆర్థిక సంఘం నిధులు మంజూరయ్యేవి. 2015లో 14వ ఆర్థిక సంఘం, నీతిఆయోగ్ నేరుగా పంచాయతీలకే కేంద్ర నిధులు ఇవ్వాలని సిఫార్సు చేశాయి. దీంతో 2015–16ఆర్థిక సంవత్సరం నుంచి మండల, జిల్లా పరిషత్‌లకు నిధులు నిలిచిపోయాయి. 2014 ఎన్నికల్లో ఎన్నికైన ఎంపీటీసీ, జడ్పీటీసీలు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారు. దీని పై ఎంపీటీసీలు చాలా సార్లు మండల సభలను బహిష్కరించి, నిరసన తెలిపినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. పంచాయతీరాజ్ సంస్థలకు2014–15లో కేవలం రూ.30.30 కోట్లేవిడుదల చేయగా, 2015–16లో రూ.752 కోట్లు,2016–17లో 957.99 కోట్లు ఇచ్చారు. రాష్ట్ర ప్రభు-త్వం ప్రవేశపెడుతున్న మొత్తం బడ్జెట్ లో పంచాతీయ-రాజ్ సంస్థలకు కేటాయింపులు 5 నుం చి 6 శాతానికిమిం చకపోవడం గమనార్హం. రాష్ట్రంలో స్టో న్ క్రషర్లు,గ్రానైట్ క్వా రీల నుం చి రావాల్సి న సీనరేజీ సెస్ ,ఆస్తుల రిజిస్ట్రేషన్ సమయంలో వసూలు చేసే ట్రా-న్స్‌ఫర్ ట్యాక్స్ వంటివేవీ జిల్లా, మండల పరిషత్ లకుఅందడం లేదు. పరిషత్ లకు కూడా నిధులివ్వా లని15వ ఆర్థిక సంఘానికి కేం ద్రం సూచిం చడంతో ఆనిధులపై అధికారులు ఆశలు పెట్టుకున్నారు .
అధికారాలేవీ?
73వ రాజ్యాంగ సవరణ ద్వారా 243-జీ ఆర్టికల్‌లో చేర్చిన 11వ షెడ్యూల్ లో పంచాయతీ సంస్థలప్రధాన విధులు, హక్కులు, అధికారాలు ఉన్నాయి .-విద్య, వైద్యం , వ్యవసాయం, రెవెన్యూ, -చిన్న నీటిపారు-దల, -పశు సంవర్థకం, ఫారెస్ట్ తదితర శాఖల్లో ని 29అంశాలు జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్‌ల పరిధిలో,మండల స్థాయిలో మండల పరిషత్ పరిధిలో, గ్రా-మాల్లో గ్రామ పంచాయతీ పాలకవర్గా ల పరిధిలోఉండాలి. కానీ ఇది అమల్లో కి రాలేదు. తాగునీటిసరఫరా, శానిటేషన్ , స్ట్రీట్ లైట్స్ నిర్వహణ వంటివాటికే పరిషత్‌లను పరిమితం చేశారు. చట్టంలోపేర్కొన్న 29 అధికారాలు జిల్లా స్థాయిలో జడ్పీసీఈవో చేతిలో, మండలంలో ఎంపీడీవో పరిధిలోఉండాలి. కానీ వీటిపై ఆయా జిల్లాల కలెక్టర్లు, ఇన్ చా-ర్జి మంత్రులు, ఎమ్మెల్యేలే అజమాయిషీ చేస్తున్నారు.
అయినా పోటీకి సై అంటున్న విలేజీ లీడర్లు..
పరిషత్‌లకు రూపాయి రాకున్నా ఎలక్షన్లలో పోటీకిప్రయత్నిస్తున్నారు. ఏదో పదవిలో ఉంటే ఊర్లో పరపతి పెంచుకోవచ్చని, రాజకీయ భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోవచ్చని కొందరు.. సబ్సిడీ ట్రాక్టర్లు, డబుల్ బెడ్ రూమ్‌ఇళ్లలాంటి సంక్షేమ పథకాల్లో చక్రం తిప్పొచ్చని, ఎమ్మెల్యేలు, ఎంపీలు కాంట్రాక్టు పనులు ఇప్పిస్తారని ఇంకొందరు అనుకుంటున్నారు.
వికేంద్రీకరణలో వెనుకబడ్డాం
స్థానిక సంస్థలకు అధికారాలు, నిధులకేటాయింపు, నిర్వహణ విషయంలోదేశంలోనే కేరళ మొదటి స్థానంలోఉండగా, సిక్కిం , కర్ణాటక తర్వాతి స్థానాల్లో ఉన్నాయి . ఈ జాబితాలో తెలంగాణ 18వస్థానంతో వెనుకబడినట్టు టాటా ఇనిస్టి ట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్ ) నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్20వ స్థానంతో మరింత వెనుక ఉంది. ప్రజలు ఎన్నుకున్న మండల, జిల్లా పరిషత్‌లకు సమాంతరంగా రైతు సమన్వయ సమితులు, జన్మభూమి కమిటీలు, వాటర్‌షెడ్ కమిటీల వంటి వాటిని ఏర్పాటు చేస్తూస్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్నట్లు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
స్టేట్ ఫైనాన్స్ కమిషన్ పైనే ఆశలు
రాష్ట్రాలకు నిధుల కేటాయింపులపై కేంద్రానికి సిఫార్సులు చేసే సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ తరహాలోనే…రాష్ట్రాల్లోనూ జడ్పీలు, మండల పరిషత్‌లకు కేటాయించాల్సిన నిధులను సిఫార్సు చేసేందుకు స్టేట్‌ఫైనాన్స్ కమిషన్ (ఎస్‌ఎఫ్‌సీ)లను ఏర్పాటు చేయాల్సిఉంది. ఉమ్మడి ఏపీ ప్రభుత్వాలు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ల (ఎస్‌ఎఫ్‌సీ) ఏర్పాటులో, ఆ కమిషన్లు ఇచ్చిన సిఫార్సుల అమల్లో నిర్లక్ష్యం చూపాయి. మూడో ఎస్‌ఫ్‌సీ సిఫార్సులిచ్చినా సమయానికి రాష్ట్ర విభజన జరగడంతో అది బుట్టదాఖలైంది. రాష్ట్రం ఏర్పాటైన రెండేళ్లకు 2017లో ప్రభుత్వం రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ను ఏర్పాటు చేసిం ది. సీఎఫ్‌సీ సిఫార్సులను కేంద్రం తప్పకుండా అమలు చేసినట్లే రాష్ట్ర ప్రభుత్వా లుఎస్ ఎఫ్‌సీ సిఫార్సులను అమలు చేయాలని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.
కేరళ ‘స్థానిక’పాలన ఆదర్శం
కేరళ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ లో జీపీ విండో పేరుతో 30 శాతం నిధులను స్థా నిక సంస్థలకుకేటాయిస్తోంది. చట్టం ప్రకారం 29 అధికారాలను పరిషత్ లకే కట్టబెట్టింది. అందుకే అక్కడి పాలనమన తెలుగు రాష్ట్రాల కంటే 20 ఏళ్ల ముందుంది. కర్నాటక, సిక్కిం కూడా ఇందులో ముందున్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వ నిధులు పంచాయతీ రాజ్ సంస్థలకు సరిపోవడం లేదు. చిన్నచిన్న తండాలనుకూడా గ్రామపంచాయతీలుగా మార్చిన తరుణంలో వాటికి వచ్చే ఆదాయం స్థానిక అవసరాలకుసరిపోదు. ఇక్కడ కూడా బడ్జెట్ లో 30 శాతం నిధులను పంచాయతీరాజ్ సంస్థలకు కేటాయించి,చట్టంలో పేర్కొన్న 29 అధికారాలను బదలాయించినప్పుడే గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుంది.
– ప్రొఫెసర్ ఎం.గోపీనాథ్ రెడ్డి, సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్