నల్గొండ అర్బన్, వెలుగు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేతృత్వంలో జిల్లా అభివృద్ధి చెందుతుందని పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య చెప్పారు. కోమటిరెడ్డి భారీ మెజార్టీతో గెలవడంతో పాటు మంత్రి పదవి చేపట్టడంతో శుక్రవారం వారిని మాలమహానాడు నేతలు సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అత్యధిక మెజార్టీతో గెలవడంలో ప్రతి కార్యకర్త కృషి ఉందన్నారు.
మంత్రి పదవి కూడా వచ్చిందని, ఆయన సహకారంతో జిల్లాను అభివృద్ధి చేసుకుందామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ నాయకుమగ, జిల్లా గ్రంథాలయం మాజీ చైర్మన్ రేకల భద్రాద్రి, కాంగ్రెస్ , మాల మానాడు నాయకులు కంచి మధు సుదన్, తల్లమల్ల యాదగిరి, యన్నమల్ల అనిల్ కుమార్, చింతపల్లి లింగమయ్య, యన్నమల్ల ప్రభాకర్, జయశంకర్, గాదరి రవి, గాలి నాగరాజు, తల్లమల్ల జనార్దన్, శ్రీను, మహేశ్ పాల్గొన్నారు.