రాష్ట్ర సర్కార్ కు జడ్పీటీసీల హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: వచ్చే బడ్జెట్ సమావేశాల్లో కొత్త పంచాయతీ రాజ్ చట్టంలో సవరణలు చేయాలని పంచాయతీ రాజ్ చాంబర్ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. గతంలో లాగానే మైనింగ్, సీనరేజ్, స్టాంప్ డ్యూటీ నిధులు లోకల్ బాడీలకు ఇవ్వాలని కోరారు. సోమవారం లక్డీకాపూల్ లోని ఫ్యాప్సీ భవన్ లో జడ్పీటీసీల రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. జడ్పీలకు, జడ్పీటీసీలకు నిధులు కేటాయిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని సత్యనారాయణ రెడ్డి గుర్తు చేశారు. దీన్ని వచ్చే బడ్జెట్ సమావేశాల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జడ్పీటీసీలు భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తారని ఆయన హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లోకల్ బాడీలను పట్టించుకోవడం లేదని జడ్పీటీసీల సంఘం అధ్యక్షుడు బెల్లం శ్రీనివాసరావు మండిపడ్డారు. ప్రతి జడ్పీటీసీకి ఏడాదికి రూ.50 లక్షలు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే నగేష్, భరత్ ప్రసాద్ పాల్గొన్నారు.
For More News..