కొల్లూరులో జువారీ భారీ ప్రాజెక్టు

కొల్లూరులో జువారీ భారీ ప్రాజెక్టు

హైదరాబాద్, వెలుగు:  రియల్ ఎస్టేట్ డెవలపర్ జువారీ ఇన్‌‌ఫ్రావరల్డ్ ఇండియా లిమిటెడ్  కొల్లూరు ప్రీమియం రెసిడెన్షియల్​ ప్రాజెక్ట్ జువారీ గంగోత్రి త్రిభుజను.. గంగోత్రి డెవలపర్‌‌లతో కలసి నిర్మిస్తున్నట్టు ప్రకటించింది. దాదాపు 9.4 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఉన్నత స్థాయి ప్రాజెక్టును గంగోత్రి గ్రూప్  డెవలప్​చేస్తోంది. 

డెవలప్‌‌మెంట్ మేనేజర్‌‌గా జువారీ ఇన్‌‌ఫ్రా వరల్డ్  వ్యవహరిస్తోంది. దాదాపు రూ. 1500 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో తొమ్మిది టవర్లు ఉంటాయి. ఇక్కడ 3,4 బెడ్ల అపార్టుమెంట్లను నిర్మిస్తారు. రెరా ఆమోదం పొందిన తర్వాత అమ్మకాలు మొదలవుతాయని జువారీ  గ్రూప్  ప్రమోటర్ అక్షయ్ పొద్దార్ చెప్పారు.