వాషింగ్టన్: కరోనా కంటెంట్‌ను తొలగించాలని బైడెన్ సర్కారు తమను ఒత్తిడి చేసిందని మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ఆరోపించారు. ప్రభుత్వ డిమాండ్లకు తలొగ్గినందుకు ఇప్పుడు చాలా బాధపడుతున్నానని ఆయన తెలిపారు. కొవిడ్ 19 కంటెంట్‌పై సెన్సార్ విధించుకోవాలని 2021లో వైట్‌హౌస్‌తో పాటు బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌కు చెందిన సీనియర్ అధికారులు మా కంపెనీ ప్రతినిధులను అదేపనిగా ఒత్తిడి చేశారని ఆయన వెల్లడించారు.
ఈమేరకు అమెరికా ప్రతినిధుల సభకు ఆయన లేఖ రాశారు. ప్రభుత్వం తమ కంపెనీ బృందాలను అలా ఒత్తిడికి గురిచేయడం కరెక్టు కాదని, ఈ విషయంపై ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేనని జుకర్ బర్గ్ పేర్కొన్నారు. కాగా.. కరోనా మహమ్మారికి సంబంధించిన లాక్ డౌన్, వ్యాక్సిన్లు, మాస్కుల ధారణ వంటి కంటెంట్‌ను తొలగించినందుకు ఫేస్ బుక్ అధికారులపై అప్పుడు విమర్శలు వెల్లువెత్తాయి. కేవలం ఒక్క ఏడాదిలోనే 2 కోట్ల కాపీలను ఫేస్ బుక్ తొలగించింది.