
పారిస్ : జర్మనీ స్టార్ ప్లేయర్ అలెగ్జాండర్ జ్వెరెవ్.. ఫ్రెంచ్ ఓపెన్‌లో చెమటోడ్చి ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. శనివారం జరిగిన మెన్స్ సింగిల్స్ మూడో రౌండ్‌లో నాలుగోసీడ్ జ్వెరెవ్ 3–6, 6–4, 6–2, 4–6, 7–6 (10/3)తో టాలన్ గ్రీక్స్‌పూర్ (నెదర్లాండ్స్) పోరాడి నెగ్గాడు. ఐదో సీడ్ మెద్వెదెవ్ (రష్యా) 7–6 (7/4), 7–5, 1–6, 6–4తో మచాక్ (చెక్)పై గెలిచి ముందంజ వేశాడు.
విమెన్స్ సింగిల్స్‌లో రెండోసీడ్ సబలెంక (బెలారస్) 7–5, 6–1తో పౌలా బడోసా (స్పెయిన్)పై గెలవగా, రిబకిన 6–4, 6–2తో ఎలిస్ మార్టినెజ్ (బెల్జియం)ను ఓడించింది. మెన్స్ డబుల్స్ రెండో రౌండ్‌లో శ్రీరామ్ బాలాజీ (ఇండియా) –మార్జినెస్ (మెక్సికో) 6–4, 3–6, 6–2తో అడెడ్–థియో అరిబాగ్ (ఫ్రాన్స్)పై గెలిచి మూడో రౌండ్ చేరారు.