గుడ్న్యూస్..ఫ్లూని ఎదుర్కొనేందుకు జైడస్ వ్యాక్సీఫ్లూ వ్యాక్సిన్‌‌‌‌

గుడ్న్యూస్..ఫ్లూని ఎదుర్కొనేందుకు జైడస్ వ్యాక్సీఫ్లూ వ్యాక్సిన్‌‌‌‌

న్యూఢిల్లీ: ఇన్‌‌‌‌ఫ్లూయెంజా వైరస్ (ఫ్లూ) కొత్త వేరియంట్‌‌‌‌ను ఎదుర్కొనేందుకు ఓ వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చామని జైడస్ లైఫ్‌‌‌‌సైన్సెస్‌‌‌‌ ప్రకటించింది. డబ్ల్యూహెచ్‌‌‌‌ఓ స్టాండర్డ్స్ ప్రకారం  ఇండియాలో క్వాడ్రివలెంట్‌‌‌‌ ఇన్‌‌‌‌ఫ్లూయెంజా వైరస్‌‌‌‌ వ్యాక్సిన్‌‌‌‌ను లాంచ్ చేశామని తెలిపింది. 

వ్యాక్సిఫ్లూ–4 పేరుతో దీనిని అందుబాటులోకి తెచ్చింది. ఇన్‌‌‌‌ఫ్లూయెంజా ఏ, బీ వేరియంట్లపై కూడా ఇది పనిచేస్తుంది. సెంట్రల్  డ్రగ్ ల్యాబోరేటరీ అనుమతులు పొందా మని జైడస్ ప్రకటించింది. అహ్మదాబాద్‌‌‌‌లోని తమ వ్యాక్సిన్ టెక్నాలజీ సెంటర్‌‌‌‌‌‌‌‌లో వ్యాక్సిఫ్లూ–4 ను డెవలప్ చేశామని తెలిపింది.