జైడస్ చేతికి స్టెర్లింగ్‌‌ బయోటెక్‌‌లో 50 శాతం వాటా

జైడస్ చేతికి స్టెర్లింగ్‌‌  బయోటెక్‌‌లో 50 శాతం వాటా

న్యూఢిల్లీ: స్టెర్లింగ్ బయోటెక్‌‌లో 50 శాతం వాటాను కొనుగోలు చేయడానికి పర్ఫెక్ట్‌‌ డే ఐఎన్‌‌సీతో ఒప్పందం కుదుర్చుకున్నామని జైడస్ లైఫ్‌‌సైన్సెస్‌‌ ప్రకటించింది. ఈ ఒప్పందం ప్రకారం, పీఈ కంపెనీ టెమాసెక్‌‌కు చెందిన పర్ఫెక్ట్‌‌ డే ఐఎన్‌‌సీ  స్టెర్లింగ్‌‌ బయోటెక్‌‌లోని తన వాటాను అమ్మనుంది.

కానీ, డీల్ విలువను బయటపెట్టలేదు. ఈ డీల్ తర్వాత స్టెర్లింగ్ బయోటెక్ జాయింట్ వెంచర్ కంపెనీ కానుంది. గ్లోబల్‌‌ అవసరాల కోసం ప్రొటీన్ (జంతువుల నుంచి కాకుండా) ను తయారు చేస్తుంది.