జూలూరుపాడు,వెలుగు: ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు ఉద్యోగ నియామకాలు నిలిపివేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేశ్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని ఆర్కే ఫంక్షన్ హాల్లో ఎమ్మార్పీఎస్, ఎంఎస్సీ అనుబంధ సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ వర్గీకరణ అమలులోకి తీసుకువచ్చిన తర్వాతే ఉద్యోగాలు భర్తీ చేయాలని , కమిటీలు, కమిషన్ల పేరుతో కాలయాపన చేయకుండా, వెంటనే ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలి డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంఎస్సి రాష్ట్ర కో ఆర్డినేటర్ ఇంజం వెంకటస్వామి, చంగల గురునాథం, సాయికుమార్, వేపూరి వెంకటేశ్వర్లు, ఈసనపల్లి కృష్ణ, తూర్పు గంటి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.